కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ సూర్య 42 (Suriya 42). పీరియాడిక్ స్టోరీ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీపై తాజా అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. కొత్త షెడ్యూల్ ఇవాళ చెన్నైలో మొదలైంది.
సూర్యతోపాటు ఇతర నటీనటులపై వచ్చే సన్నివేశాలను తాజా షెడ్యూల్లో షూట్ చేయబోతుంది డైరెక్టర్ శివ టీం. సూర్య 42 ప్రాజెక్ట్ 2డీ, 3డీ ఫార్మాట్లలో కూడా 10 భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. సూర్యకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ అందించిన దేవీ శ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు.
ఇప్పటికే సూర్య 42 నుంచి విడుదలైన లుక్ సినిమాపై క్యూరియాసిటీతోపాటు అంచనాలు పెంచేస్తోంది. సూర్య నటించిన బ్లాక్ బస్టర్ సూరారై పోట్రు చిత్రాన్ని హిందీలో అక్షయ్ కుమార్ లీడ్ రోల్లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సూరారై పోట్రు హిందీ రీమేక్‌లో కీలక పాత్రలో నటిస్తున్నాడు సూర్య.
Read Also : Gurthunda Seetakalam | గుర్తుందా శీతాకాలం నుంచి మరో క్రేజీ అప్డేట్ టైం ఫిక్స్
Read Also : Mahesh Babu | నాన్న నాకిచ్చిన గొప్ప బహుమానం అదే.. మహేశ్ బాబు స్పీచ్ వైరల్
Read Also : Orange | ఆరెంజ్ రీ రిలీజ్‌పై నిర్మాత నాగబాబు క్లారిటీ