e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News వ్యాక్సిన్లు ఇప్పిస్తామ‌ని.. నిర్మాత సురేష్ బాబుకు బురిడీ

వ్యాక్సిన్లు ఇప్పిస్తామ‌ని.. నిర్మాత సురేష్ బాబుకు బురిడీ

వ్యాక్సిన్లు ఇప్పిస్తామ‌ని.. నిర్మాత సురేష్ బాబుకు బురిడీ

ఇటీవ‌లి కాలంలో ఆన్‌లైన్‌లో జ‌రుగుతున్న మోసాల‌కు అడ్డే లేదు. సామాన్యులు, సెల‌బ్రిటీలు అనే తేడా లేకుండా కేటుగాళ్లు మోసాల‌కు పాల్ప‌డుతున్నారు.తాజాగా టాలీవుడ్ సీనియ‌ర్ నిర్మాత సురేష్ బాబుని క‌రోనా వ్యాక్సిన్స్ పేరుతో ఓ వ్య‌క్తి మోసం చేశాడు. ఈ విష‌యం ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వివ‌రాల‌లోకి వెలితే ఓ కేటుగాడు తన దగ్గర కరోనా వ్యాక్సిన్లు ఉన్నాయని సురేష్‌ బాబు ఆఫీస్‌కు ఫోన్ చేశాడు. దీంతో ఆ కేటుగాడు చెప్పిన బూటకపు మాటలు నమ్మి లక్ష రూపాయలు ట్రాన్సఫర్‌ చేశాడు సురేష్ బాబు మేనేజర్.

డ‌బ్బులు ట్రాన్స‌ఫ‌ర్ చేశాక కేటుగాడికి ఫోన్ చేయ‌డంతో అత‌ని ఫోన్ స్విచ్చాఫ్ వ‌చ్చింది. దీంతో అత‌నిపై అంద‌రికి అనుమానం రావ‌డంతో జూబ్లిహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాగా, రీసెంట్‌గా షూటింగ్స్ మొద‌లు కాగా, ప‌లువురు నిర్మాత‌లు త‌మ ద‌గ్గ‌ర ప‌ని చేసే వారికి వ్యాక్సిన్స్ ఇప్పిస్తున్నారు. రీసెంట్‌గా దిల్ రాజు 200 మందికి వ్యాక్సినేష‌న్ చేయించిన విష‌యం తెలిసిందే.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వ్యాక్సిన్లు ఇప్పిస్తామ‌ని.. నిర్మాత సురేష్ బాబుకు బురిడీ
వ్యాక్సిన్లు ఇప్పిస్తామ‌ని.. నిర్మాత సురేష్ బాబుకు బురిడీ
వ్యాక్సిన్లు ఇప్పిస్తామ‌ని.. నిర్మాత సురేష్ బాబుకు బురిడీ

ట్రెండింగ్‌

Advertisement