న్యూఢిల్లీ: ద కేరళ స్టోరీ(The Kerala Story) చిత్రాన్ని బెంగాల్ ప్రభుత్వం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ బ్యాన్పై ఇవాళ సుప్రీంకోర్టు స్టే విధించింది. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నర్సింహా, జేబీ పర్దివాలాతో కూడిన ధర్మాసనం .. బెంగాల్ ఇచ్చిన బ్యాన్ ఆర్డర్‌పై స్టే జారీ చేసింది. తమిళనాడు సర్కార్ కూడా థియేటర్ల వద్ద సెక్యూర్టీని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది.
ద కేరళ స్టోరీ చిత్రాన్ని బ్యాన్ చేస్తున్నట్లు మే 8వ తేదీన పశ్చిమ బెంగాల్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ బ్యాన్‌ను సమర్ధిస్తూ బెంగాల్ సర్కార్ సరైన ఆధారాలు సమర్పించలేకపోయినట్లు కోర్టు అభిప్రాయపడింది. అందుకే బ్యాన్ ఆర్డర్‌పై స్టే విధిస్తున్నట్లు సుప్రీం పేర్కొన్నది.
ఇది కల్పిత కథ అని చిత్ర నిర్మాతలు డిస్‌క్లెయిమర్ వేయాలని కోర్టు ఆదేశించింది. 32 వేల మంది మహిళలు ఇస్లాం మతాన్ని స్వీకరించినట్లు ఇచ్చిన డేటాను మార్చాలని సూచించింది. సినిమాకు సీబీఎఫ్సీ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వమే శాంతి, భద్రత సమస్యల్ని చూసుకోవాలని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు.