న్యూఢిల్లీ: ఉదయ్‌పూర్ ఫైల్స్(Udaipur Files) చిత్రం రిలీజ్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ స్టేను సవాల్ చేస్తూ ఇవాళ చిత్ర నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యవసరంగా తమ పిటీషన్‌పై విచారణ చేపట్టాలని కోరారు. అయితే ఆ సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు సుప్రీంకోర్టు చెప్పింది. బుధవారం లేదా మరుసటి రోజు.. ఉదయ్‌పూర్ ఫైల్స్ చిత్రం స్టేపై విచారణ జరపనున్నట్లు జస్టిస్ సూర్య కాంత్, జోయ్మల్యా బగ్చీతో కూడిన ధర్మాసనం పేర్కొన్నది.
ఉదయ్‌పూర్ ఫైల్స్:కన్నయ్య లాల్ టేలర్ మర్డర్ టైటిల్‌తో ఈనెల 11వ తేదీన సినిమాను రిలీజ్ చేయాలని భావించారు. వాస్తవానికి ఆ సినిమాకు సీబీఎఫ్సీ సర్టిఫికేట్ వచ్చింది. కానీ ఆ ఫిల్మ్‌ను ప్రదర్శించరాదు అని ఢిల్లీ హైకోర్టు రిలీజ్‌పై స్టే ఇచ్చింది. సినిమాను పర్మనెంట్‌గా బ్యాన్ చేయాలని కోరుతూ కొందరు అభ్యరిస్తున్నారని, దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని, అప్పటి వరకు ఉదయ్‌పూర్ ఫైల్స్ చిత్రాన్ని రిలీజ్ చేయకుండా స్టే ఇస్తున్నామని ఢిల్లీ హైకోర్టు జూలై 10వ తేదీన కోర్టులో పేర్కొన్నది. సమాజంలో అల్లర్లు సృష్టించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ఫిల్మ్‌ను బ్యాన్ చేయాలని హైకోర్టు అభిప్రాయపడింది.
జామియత్ ఉలామా ఇ హింద్ అద్యక్షుడు, దారుల్ ఉలూమ్ దియోబాండ్ ప్రిన్సిపాల్ మౌలానా అర్షద్ మదాని ఫిల్మ్‌పై బ్యాన్ విధించాలని తన పిటీషన్లో కోరాడు. జూన్ 26వ తేదీన రిలీజైన ట్రైలర్లో అభ్యంతరకరమైన డైలాగ్‌లు ఉన్నాయని పిటీషన్లో పేర్కొన్నాడు. పిటీషనర్ల కోసం జూలై 9న చిత్రాన్ని ప్రదర్శించాలని హైకోర్టు తన తీర్పులో నిర్మాతలను ఆదేశించింది.
ఉదయ్‌పూర్‌కు చెందిన టేలర్ కన్నయ్య లాల్‌ను 2022 జూన్‌లో మర్డర్ చేశారు. మొహమ్మద్ రియాజ్, మొహమ్మద్ గౌస్ ఆ హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు చెందిన అంశాన్ని కన్నయ్య లాల్ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన నేపథ్యంలో అతన్ని హతమార్చారు. ఎన్ఐఏ పోలీసులు ఈ కేను విచారిస్తున్నారు. యూఏపీఏ కింద నిందితులపై కేసు పెట్టారు. జైపూర్‌లోని ఎన్ఐఏ కోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉన్నది.