చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) అస్వస్థతకు గురయ్యారు. ఆయన తీవ్ర కడుపు నొప్పుతో బాధపడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని అపోలో దవాఖానకు తరలించారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీశ్ ఆధ్వర్యంలోని ప్రత్యేక వైద్యుల బృందం సూపర్‌స్టార్‌కు చికిత్స అందిస్తున్నదని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నదని వైద్యులు తెలిపారు. ఉదయం 8 గంటలకు ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని వెల్లడించారు. తళైవా ఆరోగ్యం పట్ల ఆయన అభిమానులు ఆందోళనలో ఉన్నారు.
కాగా, గతంలో కూడా రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 2020 డిసెంబర్లో హైదరాబాద్‌లో ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్న సూపర్‌స్టార్.. రక్తపోటులో తీవ్ర హెచ్చుతగ్గులు రావడంతో జూబ్లీహిల్స్ అపోలో దవాఖానలో చేరారు. ప్రత్యేక ఐసీయూకు తరలించి రక్తపోటులో హెచ్చుతగ్గులను నియంత్రించారు.