Rajinikanth | రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కూలీ’. సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ సినిమా నుంచి రజనీకాంత్ కొత్త పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. ఇందులో ఆయన దేవా అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. చేతిలో 1421 నెంబర్ కలిగిన బ్యాడ్జీ పట్టుకొని రజనీకాంత్ పవర్ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు.
ఈ సినిమాలో నాగార్జున, సత్యరాజ్, శృతిహాసన్, ఉపేంద్ర వంటి అగ్ర తారలు నటిస్తున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదలకానుంది. ఇదిలావుండగా రజనీకాంత్ నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘జైలర్’ సినిమా సీక్వెల్ గురించి దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, త్వరలోనే చిత్రాన్ని సెట్స్‌మీదకు తీసుకొస్తామని తెలిపారు. అక్టోబర్‌లో ప్రారంభంకానున్నట్లు సమాచారం.