DC Movies Superman Trailer | హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ డీసీ యూనివర్స్ (DC Movies) నుంచి మూవీ వస్తుందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ సంబరపడిపోతుంటారు. ఇప్పటికే ఈ సంస్థ నుంచి బ్యాట్‌మ్యాన్(BAt man), సూపర్ మ్యాన్(Super Man), అక్వా మ్యాన్(Aqua Man), వండర్ వుమెన్(Wonder Women), ఫ్లాష్ వంటి సూపర్ హీరోల కథలపై సినిమాలు రాగా.. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు నమోదు చేశాయి. ఇక డీసీ కామిక్స్‌లో ‘సూపర్ మ్యాన్’ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 1948 నుంచి అలరిస్తు వస్తున్న ఈ ఫ్రాంచైజీకి కోట్లలో అభిమానులు ఉన్నారు.
అయితే ఈ ఫ్రాంచైజీ నుంచి కొత్త సినిమా వస్తున్న విషయం తెలిసిందే. డీసీ యూనివర్స్‌లోని సూపర్‌మ్యాన్ చిత్రాలకు రీబూట్ వెర్షన్‌గా వస్తున్న ఫస్ట్ హాలీవుడ్ చిత్రమిది. సూపర్ మ్యాన్ (Superman) అంటూ వస్తున్న ఈ సినిమాకు జేమ్స్ గన్ దర్శకత్వం వహిస్తుండగా.. ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే సూపర్ మ్యాన్ తాను ఎవరు తన కుటుంబుం ఎవరని వెతుకుతూ.. అతడు చేసే ప్రయాణం చుట్టూ ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది.
ఇందులో సూపర్ మ్యాన్ పాత్రలో డేవిడ్ కొరెన్స్‌వెట్ నటిస్తుండగా.. రెచెల్ బ్రోస్నహన్, ఇసబెలా మెర్సిర్, నాథన్ ఫిల్లోన్, ఆంటోనీ కారిగ్ తదితరులు కీలక పాత్రల్లో నటించనున్నారు. సూపర్ మ్యాన్ ఫ్రాంచైజీలో ఇది మొదటి చిత్రం కాగా.. దీనితో పాటు మరో నాలుగు ప్రాజెక్ట్‌లు ఫ్యూచర్లో రానున్నాయి.