ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కరోనాతోనో లేదంటే ఇతర అనారోగ్య సమస్యలతో కన్నుమూస్తున్నారు. వారి మరణాలు అభిమానులకు కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. తాజాగా ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు సూపర్ మ్యాన్ సృష్టికర్త రిచర్డ్ డోనర్ అనారోగ్యంతో కన్నమూసారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం కన్నుమూసారు. ఆయన మృతితో హాలీవుడ్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి చెందింది.
1960 టీవీల్లో ‘ట్విన్ లైట్ జోన్’ అనే స్పై థ్రిల్లర్ స్టోరీస్‌తో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు రిచర్డ్ డోనర్. 1978లో క్రిష్టోఫర్ రీవేతో తెరకెక్కిన ‘సూపర్ మ్యాన్’ చిత్రం ఆయనకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. 1985లో ఈయన డైరెక్ట్ చేస్తూ ప్రొడ్యూస్ చేసిన ‘గూనీస్’ సినిమా కూడా మంచి హిట్ అయింది. ఈ సినిమాతో డోనర్ పేరు అందరికి తెలిసింది. ప్రపంచ సినిమా చరిత్రలో ‘గూనీస్’ కల్డ్ క్లాసిక్‌గా నిలిచిపోయింది.
1976లో ‘ఫ్రీ విల్లీ అండ్ లాస్ట్ బాయ్స్’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన రిచర్డ్ డోనర్ కెరీర్లో ఎన్నోఅద్భుతమైన చిత్రాలు తెరకెక్కించారు. ఆయన సినిమాలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయి. ‘గూనీస్’ సినిమా ఇన్స్ప్రేషన్తో స్టీవెన్ స్పీల్ బర్గ్ పలు చిత్రాలను తెరకెక్కించారు. ఈ విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో వెల్లడించారు. హాలీవుడ్ దర్శకులకు ఆయన ఒక నిఘంటువు అని స్పీల్ బర్గ్ ఓ సందర్భంలో ఉన్నారు. ఏదేమైన రిచర్డ్ డోనర్ మృతి హాలీవుడ్ సినీ పరిశ్రమకు తీరని లోటు అని అంటున్నారు.