హైదరాబాద్: దిగ్గజ నటుడు కృష్ణంరాజు మృతిపట్ల సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ సంతాపం తెలిపారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని విచారం వ్యక్తం చేశారు.
‘కృష్ణంరాజు మనమధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. తామిద్దరిది 50 ఏండ్ల స్నేహానుబంధం. తేనెమనసులు సినిమాకు తనతోపాటు కృష్ణంరాజు కూడా ఆడిషన్స్‌కు వచ్చాడు. అయితే తాను ‘తేనె మనసులు’ సినిమాతో వెండితెరకు పరిచయమవగా, ఆయన చిలకా గోరింకలు సినిమాతో చిత్రపరిశ్రమకు పరిచయమయ్యాడు. తర్వాత ‘నేనంటే నేనే’ అనే సినిమాలో తనకు ప్రతినాయకుడిగా నటించాడు. హీరోగా సక్సెస్ అయిన తర్వాత తనతో ఇంద్రభవనం, యుద్ధం, అడవి సింహాలు ఇలా 17 సినిమాల్లో కలిసి నటించాం. ఆ సినిమాలన్నీ విజయం సాధించాయి. ఇంత త్వరగా తనను విడిచి వెళ్లినందుకు చాలా బాధగా ఉందని కృష్ణ ఆవేదన వ్యక్తంచేశారు. కృష్ణంరాజు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Superstar #Krishna Garu shares his bonding with Rebel Star #KrishnamRaju Garu and expressed his deepest condolences to the family. #RIPKrishnamRajuGaru pic.twitter.com/sOQuAEDTrN
— BA Raju's Team (@baraju_SuperHit) September 11, 2022