JUONE | ప్రముఖ నటి ఇంద్రజ చేతుల మీదుగా ఘనంగా ‘జుఒన్’ సూపర్ యాప్ లాంచ్!
JUONE |హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని పీర్లెస్ హోటల్లో ‘జుఒన్’ (JUONE) సూపర్ యాప్ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. రోజువారీ జీవితంలో ఎదురయ్యే అవసరాలకు వేర్వేరు యాప్‌లను ఉపయోగించే రోజులకు స్వస్తి పలుకుతూ, అన్ని రకాల సేవలను ఒకే వేదికపై అందించాలనే లక్ష్యంతో ఈ యాప్‌ను తీసుకొచ్చారు.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని పీర్లెస్ హోటల్లో ‘జుఒన్’ (JUONE) సూపర్ యాప్ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. రోజువారీ జీవితంలో ఎదురయ్యే అవసరాలకు వేర్వేరు యాప్‌లను ఉపయోగించే రోజులకు స్వస్తి పలుకుతూ, అన్ని రకాల సేవలను ఒకే వేదికపై అందించాలనే లక్ష్యంతో ఈ యాప్‌ను తీసుకొచ్చారు. ప్రముఖ సినీ నటి ఇంద్రజ, ఏఎన్ఎన్ మీడియా గ్రూప్ వ్యవస్థాపకులు కంది రామచంద్రారెడ్డి, జబర్దస్త్ రాము, యాప్ బ్రాండ్ అంబాసిడర్ రాధిక ఈ గ్రాండ్ లాంచ్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఈ యాప్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేవలం నగరాలకే పరిమితం కాకుండా, సెమీ-అర్బన్ మరియు పట్టణ ప్రాంతాలకు కూడా ఈ సేవలను విస్తరించారు.
‘కనెక్ట్, సర్వీసెస్, గ్రో’ మరియు ‘వన్ యాప్, మెనీ సొల్యూషన్స్’ అనే నినాదాలతో ముందుకొచ్చిన జుఒన్ ద్వారా ఒకే యాప్‌లో ఫుడ్ డెలివరీ, గ్రాసరీ, ఫార్మసీ, క్యాబ్ బుకింగ్, కార్లు-బైక్‌ల అద్దె, లాజిస్టిక్స్, ప్యాకర్స్ అండ్ మూవర్స్ వంటి 25 రకాల సేవలను పొందవచ్చు. అలాగే హోటళ్లు, రిసార్టులు, ఈవెంట్లు, పర్యాటక సేవలు, హాస్టళ్లు, పీజీ వసతి బుకింగ్ సౌకర్యాలు కూడా ఇందులో ఉన్నాయి. షాపింగ్, బ్యూటీ పార్లర్, ఇంటి శుభ్రత, పెస్ట్ కంట్రోల్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ఏసీ సర్వీసులతో పాటు కంప్యూటర్, మొబైల్ మరమ్మతులు కూడా చేసుకోవచ్చు. ఆరోగ్య అవసరాల కోసం డాక్టర్ కన్సల్టేషన్, ల్యాబ్ టెస్టులు, నర్సింగ్ సేవలను కూడా ఒకే చోట అందించేలా దీన్ని రూపొందించారు.
ఈ వేడుకలో నటి ఇంద్రజ మాట్లాడుతూ.. డిజిటల్ యుగంలో ప్రజల అవసరాలకు తగ్గట్టుగా అన్ని సేవలను ఒకే వేదికపై అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఏఎన్ఎన్ మీడియా గ్రూప్ వ్యవస్థాపకులు కంది రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. సాంకేతికతను ప్రజల అవసరాలకు అనుసంధానిస్తూ రూపొందించిన ఈ యాప్ వినియోగదారుల సమయాన్ని ఆదా చేస్తుందని తెలిపారు. బ్రాండ్ అంబాసిడర్ రాధిక మాట్లాడుతూ.. 25 రకాల సర్వీసులు ప్రతి ఒక్కరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆకాంక్షించారు.
ఫౌండర్ అండ్ సీఈఓ పి. సురేంద్రబాబు మాట్లాడుతూ.. వినియోగదారులకు సులభమైన, నమ్మకమైన మరియు వేగవంతమైన డిజిటల్ సేవలను అందించడమే తమ లక్ష్యమని, పూర్తి వివరాల కోసం www.juone.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని తెలిపారు. ప్రొప్రైటర్ బి. వివేక్ మాట్లాడుతూ.. సౌకర్యం, వేగం మరియు సులభమైన అనుభవమే తమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ‘టుగెదర్ ఫర్ ఏ స్మార్టర్ టుమారో’ నినాదంతో వస్తున్న ఈ సూపర్ యాప్ ప్రజలకు మరింత సౌకర్యవంతమైన జీవనశైలిని అందించనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Millers | రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా.. సీఎమ్మార్ అక్రమాల నేపథ్యంలో రంగంలోకి.. నలుగురు అరెస్టు
AP News | ఉప్పాడ చేపల మార్కెట్లో విలసల సందడి.. ఒక్కో చేప ధర ఎంతంటే..!
KTR | తెలంగాణ నా గోత్రం… సిరిసిల్ల కులం.. మీరుపెట్టిన భిక్షతోనే ఇంతదాక ఎదిగిన.. కేటీఆర్ భావోద్వేగం
Trivikram | ప్రభాస్‌లో ఆ యాంగిల్‌ను ఎవరూ చూపించలేదు.. త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Vehicle Mafia | వాహనాలు కొనిపించి.. అమ్మించి.. హైదరాబాద్‌లో వెహికల్ మాఫియా నయా దందా
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

