బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. హౌజ్‌మేట్స్‌తో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ఆసక్తికర టాస్క్‌లు ఇస్తున్నారు. మంగళవారం రోజు జరిగిన ఎపిసోడ్లో సూపర్ లగ్జరీ ఐటమ్స్‌తో ఇంటి సభ్యుల్ని సర్ ప్రైజ్ చేశారు బిగ్ బాస్. పానీ పూరి, పిచ్చా ఫ్రైడ్ చికెన్, బర్గర్ లాంటి లగ్జరీ ఐటమ్స్‌ని ఇచ్చి ఇందులో ఎవరికి నచ్చినవి వారు సెలక్ట్ చేసుకోండని అన్నారు. కాని దానికి ఓ కండీషన్ పెట్టారు.
గులాబ్ జామ్ టాస్క్ ఇచ్చి ఇందులో చేతులు ఉపయోగించకుండా ఎవరైతే గులాబ్ జామ్ తింటారో వాళ్లకే లగ్జరీ ఐటెమ్స్ దక్కుతాయని అన్నారు. ఇందులో సిరి తప్ప ఎవరు పర్ఫెక్ట్గా తినలేకపోయారు. సిరి అయితే టకా టకా లాగించేసింది. ఆమె తిండి చూసి ఇంట్లో ఉన్నవాళ్లంతా షాక్ అయ్యారు. సన్నీ అయితే అసలు నువ్ మనిషివేనా? అని అడిగాడు.
ఇక వాష్ రూంకి వెళ్లి వస్తున్న సిరి.. ఎడమ చేతిని పట్టుకుని సన్నీ రేఖలు చూస్తుండగా.. ఇప్పుడే బాత్ రూంకి పోయి వచ్చాను చూస్తావా? అంటూ పంచ్ ఇచ్చింది. దీంతో చీ అంటూ చేతిని విసిరి పడేశాడు. పక్కనే ఉన్న కాజల్, మానస్లు తెగనవ్వుకున్నారు. నాతో పెట్టుకుంటే ఇలా ఉంటుందని అన్నది సిరి. ఆ తరువాత రోజూ మాదిరిగానే షణ్ముఖ్-సిరిలు ఇద్దరూ మంచం ఎక్కి ముచ్చట్లు, హగ్గులు కొనసాగించారు.