సినీరంగంలో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ప్రభావం క్రమంగా విస్తరిస్తున్నది. ఏఐ వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ..సాంకేతికంగా అదొక గొప్ప ఉపకరణమని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. తాజాగా ఏఐ ఆధారంగా తొలి ఫుల్‌లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్‌ను తెరకెక్కించబోతున్నారు. ‘కౌర్ వర్సెస్ కోర్’ పేరుతో రూపొందించనున్న ఈ చిత్రంలో సన్నీలియోన్ ప్రధాన పాత్రను పోషిస్తున్నది. ఇందులో ఆమె హ్యూమన్ అండ్ ఏఐ సృష్టించిన సూపర్‌హీరోగా ద్విపాత్రాభినయంలో కనిపించనుంది. భారత్‌లో నిర్మిస్తున్న తొలి ఏఐ ఆధారిత చిత్రమిదని దర్శకుడు వినిల్ వాసు తెలిపారు.
ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమా సృజనాత్మక హద్దులను చెరిపివేస్తుంది. బాధ్యతాయుతంగా ఉపయోగిస్తే కృత్రిమ మేధతో మానవ భావోద్వేగాలను తెరపై పునఃసృష్టించవొచ్చని ఈ సినిమా రుజువు చేస్తుంది. కృత్రిమ మేధ విప్లవాన్ని భారత్ ముందుకు తీసుకుపోగలదని ఈ సినిమా నిరూపిస్తుంది’ అన్నారు. పాపరాజ్జీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అంజిక్యా జాదవ్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.