Sunny Leone | సన్నీ లియోన్ పాన్‌కార్డుతో లోన్ తీసుకున్న కేటగాళ్లు..!
ముంబై : ఇటీవల కాలంలో నగదు లావాదేవీ ఎక్కువగా ఆన్లైన్ విధానంలో సాగుతున్నాయి. దీంతో ఇదే అదునుగా కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని మాయమాటలు చెప్పి పాన్‌కార్డు వివరాలు, ఏటీఎం పిన్, ఓటీపీలు సేకరించి అందినకాడికి దోచుకుంటున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీలను సైతం బురిడీ కొట్టించిన సంఘటనలున్నాయి. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటి సన్నీ లియోన్ సైతం ఆన్లైన్ నగదు లావాదేవీల విషయంలో చేదు అనుభవం ఎదురైంది. ఆన్లైన్ నగదు లోన్ ఫ్రాడ్ బారిన పడ్డట్లు ఈ విషయాన్ని సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపింది.
గుర్తుతెలియని వ్యక్తులు తన పాన్ కార్డును ఉపయోగించి ధని యాప్ నుంచి ఎవరో రూ.2వేల రుణం తీసుకున్నారని సన్నీ లియోన్ తెలిపింది. లోన్ తిరిగి చెల్లించకుండా జాప్యం చేయడంతో తన సిబిల్ స్కోర్ దెబ్బతిందని పేర్కొంది. దీంతో వెంటనే సంబంధిత బ్యాంకు అధికారులను సంప్రదించింది. దీంతో అధికారులు వెంటనే సన్నీ లియోన్ పేరుపై లోన్ తీసుకున్న వ్యక్తులను గుర్తించి, సమస్యను పరిష్కరించారని తెలిపింది. సదరు బ్యాంకు అధికారులకు, సిబిల్ స్కోర్ సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా అందరు అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే మోసగాళ్ల బారినపడే అవకాశం ఉందని పేర్కొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

