బాలీవుడ్ (Bollywood) నటి సన్నీలియోన్ (Sunny Leone) సోషల్ మీడియాలో పోస్టు పెట్టిందంటే క్రేజ్ మామూలుగా ఉండదు. ఇటీవలే ఓ బ్రాండ్ ప్రమోషన్స్ లో భాగంగా సిల్వర్ కలర్ డ్రెస్ లో మైమరిచిపోయేలా చేసింది సన్నీ. ఈ అందాల తార ప్రపంచ ప్రముఖ పర్యాటక ప్రదేశం మాల్దీవుల్లో (Maldives) ల్యాండింగ్ అయింది. మంగళవారం మాల్దీవులు వెకేషన్ కు సంబంధించిన స్టిల్స్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
బ్లూ బీచ్ వేర్ వేసుకున్న సన్నీలియోన్ సాగరతీరంలో జలకాలాడింది. ఓ వైపు సూర్యకిరణాలను ఆస్వాదిస్తూ..మరోవైపు సముద్రనీటిలో తలపై చేయి పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ కెమెరాకు పోజులిచ్చింది. వెకేషన్ టైంలో అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. మరోవైపు బీచ్ లో చల్లని బీరు పొంగించింది సన్నీలియోన్. స్వర్గంలోకి స్వాగతం..జీవితాన్ని వేడుకగా జరుపుకుంటూ పార్టీ చేసుకునే సమయం అంటూ వీడియోకు క్యాప్షన్ పెట్టింది. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
సన్నీలియోన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. ఈ భామ తమిళంలో రెండు సినిమాలు, తెలుగు, హిందీలో రెండు చిత్రాలు, కన్నడ, మలయాళంలో ఒక్కో సినిమా చేస్తోంది. ది బ్యాటిల్ ఆఫ్ బీమా కోరేగావ్ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తోంది.