బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో జరిగిన నామినేషన్ ప్రక్రియలో కాజల్.. జెస్సీ, మానస్‌లను సేవ్ చేయకుండా షణ్ముఖ్‌ని కాజల్ సేవ్ చేయడంతో.. ఈ ఇద్దరూ కాజల్‌తో మాట్లాడటం మానేశారు. దీంతో కాజల్.. మానస్, జెస్సీల దగ్గరకు వచ్చి.. నేను ఈవారం ఎలాగూ ఎలిమినేట్ అయిపోతా.. ఈ ఒక్కవారం అయినా మాట్లాడండిరా అని ప్రాధేయపడింది.
సన్నీ.. నువ్ ఎలిమినేట్ కావడం ఏంటి కాజల్.. నువ్ నామినేట్ చేసి ఇప్పుడు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు.. ఇన్నిరోజులు నీకు ప్రాబ్లమ్ ఉంటే ప్రతి విషయంలోనూ తోడుగా ఉన్నాం,ఏదో లెటర్ ఇచ్చాడని కరిగిపోయి వేరే వాళ్లని సేవ్ చేశావు.నీకు ఇన్నాళ్లు సపోర్ట్‌గా ఉన్నందుకు మేం పిచ్చోళ్లమా. మా ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయితే ఏం చేస్తావ్.. అని అన్నాడు సన్నీ.
కాజల్ తను చేసిన తప్పును ఒప్పుకుంటూ క్షమాపణలు అడిగింది. దాంతో సన్నీ.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. నీ సారీ మాకు అవసరం లేదని చెప్పాడు సన్నీ. కొద్ది సేపటి తర్వాత క్షమించేశాడు.మరోవైపు ప్రియాంకతోను చాలాదూరంగా ఉంటున్నమానస్ని ముద్దులతో కూల్ చేసింది ప్రియాంక. ప్రియాంక. భోజనం ప్లేటు పట్టుకుని ముద్దు కావాలా? ముద్ద కావాలా? అని అడిగితే మానస్ ముద్దే కావాలన్నాడు. దీంతో ప్రియాంక దొరికిందే ఛాన్స్ అనుకుని ముద్దుల మీద ముద్దులిచ్చింది.