e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home News టాలీవుడ్‌లోమ‌ళ్లీ సంద‌డి చేయ‌నున్న స‌న్నీ లియోన్

టాలీవుడ్‌లోమ‌ళ్లీ సంద‌డి చేయ‌నున్న స‌న్నీ లియోన్

టాలీవుడ్‌లోమ‌ళ్లీ సంద‌డి చేయ‌నున్న స‌న్నీ లియోన్

బాలీవుడ్ బ్యూటీ స‌న్నీ లియోన్‌కు దేశ వ్యాప్తంగా ఎంత‌టి క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తెలుగు ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించింది ఈ ముద్దుగుమ్మ‌. మంచు మనోజ్ కరెంట్ తీగ చిత్రంలో స్పెషల్ పాత్ర స్పెషల్ నంబర్ తో యువతరాన్ని ఉర్రూతలూగించిన ఈ భామ త‌ర్వాత ఐటెం సాంగ్స్ చేసింది. కన్నడ చిత్రం కోటిగోబ్బా 3 లో డాన్స్ నంబర్ చేసిన ఈ ముద్ద‌గుమ్మ ఇప్పుడు వై.రాజ్కుమార్ దర్శకత్వం వహిస్తున్న కాటన్ పేట్ గేట్ అనే క‌న్న‌డ చిత్రంలో న‌ర్తిస్తుంది. ఇందులో స‌న్నీ త‌న ఆట పాట‌తో అల‌రించ‌నుంది.

అయితే కాట‌న్ పేట గేట్ అనే సినిమాని తెలుగులో సీతన్నపేట్ గేట్గా కూడా తీస్తున్నారు. ఈ పాట షూటింగ్ ఈ నెలాఖరులోగా హైదరాబాద్ లో ప్రారంభమవుతుంది. మార్చిలో చిత్రీకరించాలని అనుకున్న‌ప్ప‌టికీ కరోనావైరస్ రెండవ వేవ్ అన్ని ప్రణాళికలను నాశనం చేసింది. ఎట్ట‌కేల‌కు పాట రూపొందుతుంది. ఇక రానున్న రోజుల‌లో స‌న్నీ త‌న పాట‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ని సైతం అల‌రించ‌నుంది. ఈ చిత్రంలో యశ్వాన్- వేణు- కిస్లే చౌదరి ప్రధాన పాత్రల్లో నటించారు. జిస్మ్ 2తో మొదలైన సన్నీలియోన్ కెరీర్ ఇటీవల మళ్లీ యష్ రాజ్ సంస్థ ఆఫర్లతో రీబూట్ అవుతోంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
టాలీవుడ్‌లోమ‌ళ్లీ సంద‌డి చేయ‌నున్న స‌న్నీ లియోన్
టాలీవుడ్‌లోమ‌ళ్లీ సంద‌డి చేయ‌నున్న స‌న్నీ లియోన్
టాలీవుడ్‌లోమ‌ళ్లీ సంద‌డి చేయ‌నున్న స‌న్నీ లియోన్

ట్రెండింగ్‌

Advertisement