Jaat Movie | గతేడాది గదర్2 సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బోర్డర్ 2 సినిమాలో నటిస్తున్న ఈ నటుడు తెలుగు దర్శకుడితో ఒక సినిమా చేస్తున్నాడు. జాట్ అంటూ వస్తున్న ఈ చిత్రానికి క్రాక్, వీరా సింహ రెడ్డి చిత్రాల దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు.. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్రబృందం తాజాగా టీజర్‌ను వదిలింది.
టీజర్ చూస్తే.. సన్నీ డియోల్ పవర్ ఫుల్ రోల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. రణ్‌దీప్ హుడా ఈ సినిమాలో విలన్‌గా నటిస్తుండగా.. ఈ మూవీకి టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబి సినిటోగ్రాఫర్ కాగా.. అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రంతో గోపీచంద్ మలినేని బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుండటంతో ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది.