Jaat Movie | గతేడాది గదర్2 సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్. ఈ సినిమా అనంతరం వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నాడు సన్నీ డియోల్. ఇప్పటికే బోర్డర్ 2 సినిమాలో నటిస్తున్న ఈ నటుడు తాజాగా తెలుగు దర్శకుడితో ఒక సినిమా చేస్తున్నాడు. ఎస్డీజీఎం అంటూ ఈ ప్రాజెక్ట్ వస్తుండగా.. ఈ చిత్రానికి క్రాక్, వీరా సింహ రెడ్డి చిత్రాల దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. నేడు సన్నీ డియోల్ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఈ సినిమాకు జాట్ అని టైటిల్ పెట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఫస్ట్ లుక్ చూస్తే.. సన్నీ డియోల్ పవర్ ఫుల్ రోల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. రణ్‌దీప్ హుడా ఈ సినిమాలో విలన్‌గా నటిస్తుండగా.. ఈ మూవీకి టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబి సినిటోగ్రాఫర్ కాగా.. అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రంతో గోపీచంద్ మలినేని బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుండటంతో ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది.
Introducing the man with national permit for MASSIVE ACTION 💥💥@iamsunnydeol in & as #JAAT ❤️🔥#SDGM is #JAAT 🔥
MASS FEAST LOADING!@megopichand @MythriOfficial & @peoplemediafcy@RandeepHooda @vineetkumar_s @ReginaCassandra #SaiyamiKher @MusicThaman @RishiPunjabi5 @artkolla pic.twitter.com/QZSC3n23CX
— Sunny Deol (@iamsunnydeol) October 19, 2024