Border 2 | గదర్ 2తో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్‌ను తీస్తున్న విషయం తెలిసిందే. ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం బోర్డర్ 2. ఈ సినిమాకు సినిమాకు అనురాగ్‌సింగ్ దర్శకత్వం వహించనుండగా.. భూషణ్‌కుమార్, కృష్ణన్‌కుమార్, జేపీదత్తా, నిధిదత్తా కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ ధావన్, దిలిజిత్ దోసాంజే, అహాన్ శెట్టి, సోనమ్ బజ్వా తదితరులు కీలక పాత్రల్లో నటించబోతున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే నేడు ఇండిపెండెన్స్ డేని పురస్కరించుకొని మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ ఫస్ట్ లుక్‌లో సన్నీ డియోల్ గన్ పట్టుకుని శత్రువులను కాల్చుతున్నట్లు కనిపిస్తుంది. ”మళ్ళీ ఒకసారి మన హిందుస్థాన్ కోసం పోరాడదాం” అంటూ ఈ పోస్టర్‌కి క్యాప్షన్ ఇచ్చాడు సన్నీ.
Hindustan ke liye ladenge….phir ek baar! 🇮🇳🔥#Border2 hits theatres on Jan 22, 2026#HappyIndependenceDay!
@Varun_dvn @diljitdosanjh #AhanShetty #BhushanKumar #JPDutta @RealNidhiDutta #KrishanKumar @SinghAnurag79 @ShivChanana @binoygandhi @neerajkalyan_24 pic.twitter.com/JgzEaHYm6s
— Sunny Deol (@iamsunnydeol) August 15, 2025