Sunil Shetty | సినీ పరిశ్రమలో అప్పుడప్పుడూ వెలుగులోకి వచ్చే శత్రుత్వాలు, వివాదాలు కలకలం రేపుతుంటాయి. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి ఓ వివాదంతో మీడియా హెడ్‌లైన్స్‌లో నిలిచారు. తన కుమారుడు అహాన్ శెట్టిపై కావాలనే తప్పుడు ప్రచారం జరుగుతోందని, అతని కెరీర్‌ను దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారనే తీవ్ర ఆరోపణలు ఆయన చేశారు. సునీల్ శెట్టి లాంటి శాంత స్వభావం కలిగిన నటుడు ఇలా బహిరంగంగా స్పందించడం అభిమానులకు షాక్ ఇచ్చింది.
‘తడాప్’ చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన అహాన్‌కు తొలి సినిమా పరాజయం ఎదురైంది. ఆ తర్వాత అతనిపై రకరకాలుగా దుష్ప్రచారం సాగింది. సెట్స్‌లో అధిక సౌకర్యాలు కోరుతున్నాడని, నిర్మాతలు అతని ప్రవర్తన వల్ల ఇబ్బందిపడుతున్నారని, డెబ్యూ హీరో అయినా పది మంది అసిస్టెంట్లతో సెట్లో హల్చల్ చేస్తున్నాడని అలాంటి కథనాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ ప్రచారాలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నవేనని, తన కుమారుడి భవిష్యత్తును నాశనం చేయాలన్న కుట్రగా చూస్తున్నానని సునీల్ శెట్టి మీడియా ముందు అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల అహాన్ శెట్టి ప్రముఖ మరాఠీ నటి జియా శంకర్‌తో డేటింగ్లో ఉన్నాడని, త్వరలోనే పెళ్లి చేసుకోనున్నాడని వార్తలు వచ్చాయి.
దీనిపై అహాన్ టీమ్ స్పష్టతనిచ్చింది. ఇవి పూర్తిగా పుకార్లు మాత్రమే. అహాన్ ప్రస్తుతం ఎవరినీ కలవడం లేదు. అతని దృష్టి పూర్తిగా కెరీర్‌పైనే ఉంది. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు అని ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. అహాన్ నటించిన ‘తడాప్’ విఫలం అయినా, అహాన్ శెట్టికి మంచి అవకాశాలు దక్కుతున్నాయి. సీనియర్ నటుడు సన్నీ డియోల్‌తో కలిసి ‘బోర్డర్ 2’ లో నటించే అవకాశం దక్కించుకున్నాడు. తన వయస్సుకు తగిన స్క్రిప్ట్‌లను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడని అతని బృందం తెలిపింది. అహాన్ శెట్టిపై తరచుగా వస్తున్న పుకార్లు నిజంగానే పడని వారు చేస్తున్న పనా, లేకుంటే ఇది కేవలం పీఆర్ స్టంట్ మాత్రమేనా? అనే చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది. కొద్దిరోజులు ఆగితే గానీ అసలు నిజం వెలుగులోకి వచ్చేలా కనిపిస్తోంది.