Sunil in Vedantham Raghavaiah | కమెడియన్ సునీల్ కాస్త ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టు సునీల్ అయిపోయాడు. ప్రత్యేకమైన క్యారెక్టర్లు చేసుకుంటూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నాడు సునీల్. ఇదివరకు కేవలం కామెడీ మాత్రమే చేస్తాడని ఉన్న గుర్తింపు ఇప్పుడు తీసేసి.. తాను ఆల్ రౌండర్ అని నిరూపించుకునే పనిలో పడ్డాడు ఈ భీమవరం బుల్లోడు. ప్రస్తుతం ఆయన ఒప్పుకుంటున్న సినిమాలు కూడా అలాగే ఉన్నాయి. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో మంగళం శ్రీను పాత్రలో నటిస్తున్నాడు సునీల్. ఇది అతి క్రూరమైన విలన్ పాత్ర. దాంతో పాటు చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు.
రామ్ చరణ్ – శంకర్ సినిమాలోనూ సునీల్ కీలకమైన పాత్ర చేస్తున్నాడు. ఇలా ప్రతీ సినిమాలో విభిన్నమైన పాత్రలతో ముందుకు వెళ్తున్నాడు ఈయన. అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమాలో తనకు అలవాటైన కామెడీ రోల్ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం దాదాపు 15 సినిమాలకు పైగా నటిస్తున్నాడు సునీల్. వీటిలో ఎక్కువ భాగం కామెడీకి దూరంగానే ఉన్నాయి. ఇదే సమయంలో కొన్ని సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు సునీల్. అలా ఆయన ఒప్పుకున్న సినిమా వేదాంతం రాఘవయ్య. 14 రీల్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ కథ అందిస్తున్నాడు. సి.చంద్రమోహన్ ఈ చిత్రానికి దర్శకుడు.
తాజాగా ఈ చిత్రం నుంచి అనుకోని విధంగా సునీల్ తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో సునీల్ స్థానంలో యువ నటుడు సత్యదేవ్ ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది. గతంలో బ్లఫ్ మాస్టర్ సినిమాలో కూడా ముందు సునీల్ హీరోగా నటించాల్సింది. అయితే ఆ తర్వాత అందులోకి సత్యదేవ్ వచ్చాడు. ఇప్పుడు వేదాంతం రాఘవయ్య సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. అయితే ఈ సినిమా నుంచి సునీల్ ఎందుకు తప్పుకున్నాడు అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సునీల్ సెకండ్ ఇన్నింగ్స్ మామూలుగా లేదుగా.. 15 సినిమాలతో బిజీ..
RC15 | సునీల్ పాత్రను శంకర్ ఎలా డిజైన్ చేశాడో తెలుసా..?
సునీల్ ‘అందాల రాముడు’ ముందుగా ఎవరు చేయాల్సిందో తెలుసా..?
ఎన్టీఆర్ సినిమా కోసం కమెడీయన్ను విలన్గా మారుస్తున్న త్రివిక్రమ్