Sunil Narang | తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ప్రెసిడెంట్, నిర్మాత సునీల్ నారంగ్ తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికైన 24 గంటల్లోనే సునీల్ నారంగ్ రాజీనామా చేయడం ఇండస్ట్రీ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. కొందరి వ్యాఖ్యలు నన్ను బాధించాయి. నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కొందరు ప్రకటనలు జారీ చేస్తున్నారని అన్నారు.
నాకు సంబంధం లేని విషయంలో నా పేరు వాడారన్నారు.
సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా నియామకమైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని తెలంగాణ ఫిలిం చాంబర్లో శనివారం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మరోసారి అధ్యక్షుడిగా సునీల్ నారంగ్ ఎన్నికవగా.. ఉపాధ్యక్షులుగా రవీంద్ర గోపాల్, కే ఉదయ్ కుమార్‌రెడ్డి ఎన్నికయ్యారు. వీఎల్ కార్యదర్శిగా శ్రీధర్ , జాయింట్ సెక్రటరీగా జే చంద్ర శేఖర్ రావు ఎంపికయ్యారు. బీ సత్యన్నారాయణ గౌడ్‌ను ట్రెజరర్ ఎన్నుకున్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా 14 మంది నియామకమయ్యారు.
Chiru 157 | చిరు ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్న అనీల్ రావిపూడి.. ఇది ఊహించలేదుగా..!
Sardar 2 Shoot Wrap | షూటింగ్ పూర్తిచేసుకున్న కార్తీ ‘సర్దార్ 2’
Samantha | ఏంటి.. అఖిల్ పెళ్లికి సమంత వచ్చిందా.. వైరల్ అవుతున్న వీడియో..!