Samantha | టాలీవుడ్ యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని, తన ప్రియురాలు జైనాబ్ రవ్జీతో వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఈ వివాహం జూన్ 6, 2025న హైదరాబాద్‌లోని నాగార్జున ఇంట్లో అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. జైనాబ్‌తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న అఖిల్ పెద్దలని ఓప్పించి పెళ్లి చేసుకున్నారు. ఈ రోజు వారి రిసెప్షన్ జరగనున్నట్టు తెలుస్తుంది. అఖిల్ పెళ్లికి.. పలువురు సినీ పరిశ్రమ సెలబ్రిటీలు హాజరు కావడంతో అఖిల్ – జైనబ్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నాగార్జున, నాగ చైతన్య తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా నవ దంపతుల ఫోటోలు షేర్ చేశారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేశాయి. అయితే ఈ పెళ్లికి సమంత కూడా వచ్చిందన్న వార్త నెట్టింట వైరల్ అవుతుంది. నాగచైతన్యతో విడిపోయిన తరువాత కూడా.. అఖిల్, సమంత మధ్య మంచి స్నేహబంధం నడిచింది. ముఖ్యంగా సమంత ప్రతి పుట్టినరోజుకి అఖిల్ విష్ చేస్తుంది. అలానే సమంత కూడా అఖిల్ ప్రతి పుట్టినరోజుకి విష్ చేస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఒకరి పోస్టులు ఒకరు కొన్నిసార్లు లైక్ చేయడం మనం చూడవచ్చు. ఇలా వారిద్దరి మధ్య మంచి సత్సంబందం ఉంది కాబట్టి అఖిల్ పెళ్లికి సమంత వచ్చిందని , సమంత కార్ పార్కింగ్ ఏరియాలో నడుస్తూ ఉన్న వీడియోని చూపిస్తూ తెగ షేర్ చేస్తున్నారు.
అయితే సమంత ఎక్కడో బయటకు వెళ్లినప్పుడు వీడియోని అఖిల్ పెళ్ళికి జత చేసి దానిని సోషల్ మీడియా పేజ్‌లలో తెగ షేర్ చేస్తున్నారు. సమంత.. అఖిల్ పెళ్లికి రాలేదని అదంతా ఫేక్ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన అఖిల్ -జైనబర్ వివాహానికి కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత సురేష్ బాబు, హీరో రామ్ చరణ్ – ఉపాసన, దగ్గుబాటి వెంకటేష్, రానా సహా అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకలో పాల్గొనగా, నాగచైతన్య, శోభితా దూళిపాళ్ల, సుశాంత్, సుమంత్, నాగసుశీల, సుప్రియా తదితరులు కనిపించారు.