Sardar 2 Shoot Wrap | షూటింగ్ పూర్తిచేసుకున్న కార్తీ ‘సర్దార్ 2’
Sardar 2 | తమిళ నటుడు కార్తీ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాలలో సర్దార్ ఒకటి. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
Sardar 2 | తమిళ నటుడు కార్తీ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాలలో సర్దార్ ఒకటి. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమాకు తాజాగా సీక్వెల్‌ను రాబోతున్న విషయం తెలిసిందే. పీఎస్ మిత్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మాళవిక మోహనన్ కథానాయకగా నటిస్తుంది. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా సాలిడ్ అప్డేట్ను పంచుకుంది. ఈ సినిమా షూటింగ్ తాజాగా కంప్లీట్ చేసుకున్నట్లు కార్తీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. థాయిలాండ్‌లోని హావా హిన్ ఎయిర్‌పోర్ట్‌లో చిత్రయూనిట్‌తో కేక్ కట్ చేస్తూ.. సర్థార్ 2 షూటింగ్ పూర్తయినట్లు తెలిపాడు.
‘సర్దార్ 2’ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. పార్ట్ 1కు జీవీ ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడిగా పని చేయగా, సీక్వెల్‌కు యువన్ శంకర్ రాజాను తీసుకోవడం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. అంతేకాకుండా, ఈ సీక్వెల్లో స్టార్ నటుడు ఎస్జే సూర్య కీలక పాత్రలో నటించబోతున్నారు. ‘సర్దార్ 2’ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై లక్ష్మణ్ కుమార్, ఇషాన్ సక్సేనా నిర్మిస్తున్నారు.
#Sardar2 – That’s a wrap!. What an adventure it’s been!!@Psmithran @iam_SJSuryah @lakku76 @venkatavmedia @B4UMotionPics @MalavikaM_ @AshikaRanganath @rajishavijayan @iYogiBabu @SamCSmusic @george_dop @editorvijay @Prince_Pictures pic.twitter.com/gg0sXFNpsd
— Karthi (@Karthi_Offl) June 7, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | డబుల్ ఎమోషనల్ సర్ప్రైజ్.. ముకేశ్‌కు తల్లి ప్రేమ,శివకుమార్‌కు ప్రియాంకతో ఎంగేజ్మెంట్!
ఆలయ ప్రాంగణంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. రూ.13,200 నగదు స్వాధీనం
Priya Bhavani Shankar | ప్రియుడితో ఏడడుగులు వేసిన ఇరుముడి హీరోయిన్.. క్యూట్ పిక్స్ షేర్ చేసిన ప్రియా భవాని
RTC Bus Pass | బస్‌పాస్ జారీలో గందరగోళం.. ఇష్టానుసారంగా బస్ పాస్‌లు జారీ చేస్తున్న ఆర్టీసీ
Kamal Haasan | టైటిల్ వివాదంలో ‘సండియర్’.. గతంలో విరుమాండి’గా పేరు మార్పు..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

