టాలీవుడ్ (Tollywood) యాక్టర్లు సునీల్ (Sunil ), శ్రీవిద్య మహర్షి, దివ్య శ్రీపాద, చాందినీరావు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న జీ5 చిత్రం హెడ్స్ అండ్ టేల్స్ (Heads & Tales). కలర్ ఫొటో ఫేం సందీప్ రాజ్ (Sandeep Raj) ఈ చిత్రానికి కథనందిస్తున్నాడు. సాయి కృష్ణాఎన్రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను హీరోయిన్ రెజీనా కసాండ్రా విడుదల చేసింది.
హెడ్స్ అండ్ టేల్స్ నుంచి సునీల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా.. నుదుటన విభూతితో కొత్తగా కనిపిస్తున్నాడు సునీల్. జనాల కథలు రాసే దేవుడి పాత్రలో సునీల్ కనిపించబోతున్నాడట. శ్రీవిద్య-దివ్య ఇప్పటికే యూట్యూబ్ కంటెంట్ గర్ల్ ఫార్ములా (Girl Formula)తో నెటిజన్లను అలరించారు. ఇక కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్..ఆ తర్వాత సోలో హీరోగా కలిసి రాకపోవడంతో క్యారెక్టర్ రోల్స్ పై దృష్టిపెట్టాడు.
కలర్ ఫొటోలో సునీల్ పోషించిన నెగెటివ్ రోల్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం వెంకటేశ్, వరుణ్ తేజ్ నటిస్తోన్న ఎఫ్ 3లో కీలక పాత్ర పోషిస్తున్నాడు సునీల్. దీంతోపాటు శంకర్, రాంచరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న RC 15లో కూడా నటిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
Seetimaarr | ఓటీటీలో ‘సీటీమార్’ ఈల వేసేది అప్పుడే..!
Konda Polam movie Review | కొండపొలం రివ్యూ
Chiranjeevi: కుటుంబంతో కలిసి ‘కొండ పొలం’ వీక్షించిన చిరంజీవి.. కామెంట్ ఏంటి?