Sunil | ఇటీవలి కాలంలో చాలా మంది సినీ సెలబ్రిటీలు పొలిటికల్ ఎంట్రీ ఇస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కమెడీయన్ సునీల్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ విషయం తెలిసి అందరు అవాక్కవుతున్నారు. వివరాలలోకి వెళితే సునీల్ కమెడీయన్‌గా, హీరోగా అదరగొట్టిన విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో నటుడు సునీల్ సీరియస్ పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నాడు. గత ఏడాదే 11 సినిమాలతో ప్రేక్షకులని అలరించాడు. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతోనూ అలరించాడు. `రామం రాఘవం`, `మ్యాడ్ స్క్వేర్` చిత్రాలతో మెప్పించాడు. కొన్ని కొత్త ప్రాజెక్ట్‌లు కూడా సైన్ చేసినట్టు తెలుస్తుంది.
ఇప్పుడు సునీల్ రాజకీయ పాత్రలలోను నటించి మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న సునీల్ అనే టైటిల్ చూసి కాస్త కంగారు పడి ఉండారు. కాని ఆయన రియల్ లైఫ్‌లో కాదు, రీల్ లైఫ్‌లో పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇంతకీ ఏంటా సినిమా? అనేది చూస్తే.. దళపతి విజయ్ కథానాయకుడిగా కోలీవుడ్ లో వినోధ్ దర్శక త్వంలో `జననాయగన్` చిత్రం రూపొందుతుంది. విజయ్ రాజకీయంగా ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన చేస్తున్న తొలి పొలిటికల్ చిత్రం ఇది. రానున్న ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని విజయ్ ఈ చిత్రం చేస్తున్నాడు.
ఇందులో విజయ్ రాజకీయ నాయకుడి పాత్ర పోషించనుండగా, ఆయనతో పాటు మరికొంత మంది రాజకీయ నాయకుల పాత్రలు పోషిస్తున్నారు. వారంతా తమిళ నటులే. అయితే ఓ తమిళ రాజకీయ నాయకుడి పాత్రలో నటించే అవకాశం సునీల్ కి దక్కడం చర్చనీయాంశంగా మారింది. సునీల్‌ది చిత్రంలో విజయ్‌కి ప్రత్యర్ధి పాత్ర అంటున్నారు. సునీల్ ఆహార్యం, వైట్ అండ్ వైట్ గెటప్ ఇంట్రెస్టింగ్ ఉంటుందంటున్నారు. మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో తెలియదు కాని ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. గతంలో ఎప్పుడు సునీల్ ఇలాంటి తరహా పాత్ర పోషించింది లేదు. కోలీవుడ్ లో సునీల్ అరుదైన ఛాన్స్ అందుకుంటున్నాడు.