తొలి సినిమా ‘డియర్ ఉమ’కు కథానాయికగా, రచయితగా, నిర్మాతగా బహు బాధ్యతలను నిర్వర్తించి, అందరి దృష్టినీ ఆకట్టుకున్నారు తెలుగమ్మాయి సుమయారెడ్డి. అనంతపురంకి చెందిన ఈ తెలుగందం పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా తన భవిష్యత్ ప్రణాళికల గురించి సుమయారెడ్డి మీడియాకు తెలియజేశారు.
సుమచిత్రా ఆర్ట్స్ పతాకంపై త్వరలో సినిమాలను నిర్మించనున్నట్టు ఆమె తెలిపారు. అలాగే, హీరోయిన్గా కూడా కొన్ని సినిమాల్లో నటించనున్నట్టు సుమయారెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే తన ప్రాజెక్టుల వివరాలు వెల్లడిస్తామని ఆమె చెప్పారు.