ఆధునిక సమాజంలో మూఢనమ్మకాల్ని ప్రశ్నిస్తూ తెరకెక్కిస్తున్న ‘నిమ్మకాయ..నీకెందుకు భయం’ చిత్రం బుధవారం ప్రారంభమైంది. రాజేష్ భూపతి, స్వప్నరాజ్, అబిత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సుమన్, ఆమని ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు.
రోశిరెడ్డి పందిళ్లపల్లి దర్శకుడు. బి.వి.సి.ఫిల్మ్స్ పతాకంపై బీఎన్ఆర్ చౌదరి నిర్మిస్తున్నారు. మూఢనమ్మకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, చక్కటి వినోదంతో పాటు సందేశంతో ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. ఆగస్ట్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: డి.యాదగిరి, సంగీతం: వరికుప్పల యాదగిరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకుడు: రోశిరెడ్డి పందిళ్లపల్లి.