‘రంగస్థలం’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్. వీరిద్దరి కాంబినేషన్లో మరో భారీ ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ‘పుష్ప’ ఫ్రాంఛైజీ చిత్రాల తర్వాత దర్శకుడు సుకుమార్ తెరకెక్కించే చిత్రమిదేకావడంతో ఈ ప్రాజెక్ట్‌పై పాన్ ఇండియా స్థాయిలో హైప్ క్రియేట్ అవుతున్నది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో సుకుమార్ బిజీగా ఉన్నారు. దుబాయ్‌లో ఉంటూ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నారాయన. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందని, అదే నెలలో రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెడతారని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని రూపొందించనుంది.