Ramcharan 17 Movie | టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వచ్చిన తాజా చిత్రం డ్యూడ్. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా సక్సెస్ ఈవెంట్‌ను నేడు నిర్వహించగా.. ఈ వేడుకలో సుకుమార్ – రామ్ చరణ్ సినిమా గురించి అప్డేట్ను పంచుకుంది చిత్రబృందం. మైత్రీ బ్యానర్లో సుకుమార్‌తో వచ్చే తదుపరి చిత్రం ఏంటి అని మీడియా అడుగగా.. మైత్రీ నిర్మాతలు స్పందిస్తూ.. పుష్ప 3 కంటే ముందు సుకుమార్ – రామ్ చరణ్ సినిమా ఉండబోతుందని తెలిపింది. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ అనంతరం రామ్ చరణ్ డేట్స్ చూసుకొని సుకుమార్ – రామ్ చరణ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాం అంటూ మైత్రీ స్పందించింది.
#Sukumar garu’s immediate next film is not #Pushpa3, it’s with #RamCharan. After #Peddi we will start shoot in April or May next year
– Mythri #Naveen at #Dude Success meet
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) October 18, 2025