KOKO First Glimpse | ఇండియా తొలి పక్కా సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రాబోతున్న చిత్రం కోకో (KOKO). సైబర్ వార్ఫేర్ చుట్టూ తిరిగే కథాంశంతో జైకుమార్ (Jai kumar)డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ గ్లింప్స్ వీడియో (KOKO First Glimpse)ను స్టార్ డైరెక్టర్ సుకుమార్ విడుదల చేశారు. నిక్కీ అనే యువతి కోకో అని నామకరణం చేయబడిన (స్వీయ నిర్మిత కృత్రిమ మేధస్సు) సెల్ఫ్ మేడ్ ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా, తన తండ్రి రామానుజన్ కోరికను ఎలా తీర్చిందనే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగుతోంది గ్లింప్స్ వీడియో.
నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది టీం. కోకో, శత్రువుల మధ్య పోరు నేపథ్యంలో సాగే కథాంశంతో సినిమా రాబోతున్నట్టు గ్లింప్స్ వీడియోతో అర్థమవుతోంది. కోకో చిత్రం హైటెక్నెకల్ వాల్యూస్‌తో తెరకెక్కుతుంది. 100 వర్కింగ్ డేస్‌లో వియత్నాం, లడఖ్, చైనా, కేరళ, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని షూట్ చేయనున్నారు.
మిరాయి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సందీప్ రెడ్డి వాస నిర్మిస్తన్నారు. కోకో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, వియత్నామీస్, తైవానీస్ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. వియత్నామీస్, తైవానీస్ భాషల్లో డైరెక్టుగా విడుదలవుతున్న తొలి ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. ఈ చిత్రానికి రఘురామ్ కోటిపల్లి సినిమాటోగ్రఫీ.. ప్రభుదేవా ఎడిటర్.
కోకో ఫస్ట్ గ్లింప్స్ వీడియో ..
Bedurulanka 2012 | కార్తికేయ బెదురులంక 2012 థియేటర్లకు వచ్చే టైం ఫిక్స్
Jr NTR | ఆస్కార్ తర్వాత తారక్ కాస్లీ కమర్షియల్ యాడ్
Double iSmart | సీక్వెల్‌కు డబుల్ ఇస్మార్ట్ టైటిల్.. పూరీ, రామ్ ప్రాజెక్ట్ వివరాలివే