చిరంజీవి హీరోగా నటిస్తున్న 154వ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు బాబీ రూపొందిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాతలు. జీకే మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శృతిహాసన్ నాయికగా నటిస్తున్నది.
చిరంజీవి, శృతిహాసన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితర ప్రధాన తారాగణం పాల్గొంటున్న కీలక సన్నివేశాలను హైదరాబాద్‌లో జరుగుతున్న తాజా షెడ్యూల్లో చిత్రీకరిస్తున్నారు. ఈ సెట్స్‌ను దర్శకుడు సుకుమార్ సందర్శించారు. సినిమా రష్ను సుకుమార్‌కు చూపించారు దర్శకుడు బాబీ. ఈ ఫొటోను సోషల్ మీడియాలో చిత్రబృందం విడుదల చేసింది. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవి శ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.