Sukumar Daughter | టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి లీడ్ రోల్లో నటించిన డెబ్యూ చిత్రం గాంధీ తాత చెట్టు (Gandhi Thatha Chettu). పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సుకుమార్ రైటింగ్స్ బ్యానర్-గోపీటాకీస్తో కలిసి నవీన్ యేర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మించారు.
తబితా సుకుమార్ సమర్పిస్తున్న ఈ మూవీ జనవరి 24న విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుకృతి తన మాటలతో మీడియా, ప్రేక్షకుల అటెన్షన్‌ను తనవైపునకు తిప్పుకుంది. చిన్నప్పుడు నేను కూడా యాక్ట్ చేయాలనే కోరిక కలిగిందా..? డాడీని ఎప్పుడైనా ఈ విషయం అడిగావా..? అని ఓ రిపోర్టర్ సుకృతిని ప్రశ్నించాడు.
దీనికి సుకృతి స్పందిస్తూ.. పుష్ప, పుష్ప 2కు కూడా అడిగాను. నా టీచర్స్, స్నేహితులు, నాకు తెలిసినోళ్లందరూ నువ్వు పుష్పలో నటిస్తున్నవా అంటే.. హహ చేస్తలేను నాకు చేయబుద్ది అవ్వలేదు. ఎందుకంటే నేను సుకుమార్ పాపను కదా అందుకే పెట్టినరు అనుకుంటరు. కానీ అసలు విషయమేంటంటే.. డాడీని పుష్పలో యాక్ట్ చేస్తా అని అడిగితే.. ఆయన ఆడిషన్ చెయ్.. చూద్దాం అన్నారని సమాధానమిచ్చింది. సుకృతి కామెంట్స్ ఇప్పుడు నెట్టింట రౌండప్ చేస్తున్నాయి.
Naga Chaitanya | మాటిచ్చిన తండేల్ రాజు.. చేపల పులుసు వండిన నాగచైతన్య