Sukumar Birthday Special Video | టాలీవుడ్ అగ్ర దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa The Rule). అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా నటించగా.. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అందుకోవడమే కాకుండా రూ.1850 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ సినిమాను చైనాలో కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
ఇదిలావుంటే నేడు దర్శకుడు సుకుమార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే తాజాగా పుష్ప మేకర్స్ కూడా సుకుమార్‌కి బర్త్‌డే విషెస్ తెలుపుతూ స్పెషల్ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో పుష్ప 2 కోసం సుకుమార్ ఎంత కష్టపడ్డాడో చూపించడంతో పాటు అల్లు అర్జున్, రష్మిక, శ్రీలీల, గణేష్ ఆచార్య లాంటి వారు సుకుమార్‌తో తమకున్న అనుభవం గురించి పంచుకున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.
Also Read..