సుహాస్, శివానీ నాగారం జంటగా నటిస్తున్న చిత్రం ‘హే భగవాన్’. గోపీ అచ్చర దర్శకుడు. త్రిశుల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకురానుంది. నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు. బుధవారం టీజర్‌ను విడుదల చేశారు. ఆద్యంతం హాస్య ప్రధానంగా సాగే చిత్రమిదని, తన గత చిత్రాలకు పూర్తి భిన్నమైన పాత్ర ఇదని సుహాస్ తెలిపారు.
ప్రేక్షకులకు కావాల్సినంత నవ్వుల్ని పంచే సినిమా అవుతుందని కథానాయిక శివానీ నాగారం చెప్పింది. ఈ సినిమాలో కామెడీతో పాటు కంటెంట్ కూడా చాలా కొత్తగా ఉంటుందని, సుహాస్ పర్ఫార్మెన్స్ ప్రధానాకర్షణగా నిలుస్తుందని నిర్మాత వంశీ నందిపాటి పేర్కొన్నారు. వీకే నరేష్, వెన్నెల కిషోర్, సుదర్శన్, అన్నపూర్ణమ్మ, అజయ్‌ఘోష్, స్రవంతి చొక్కారపు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మహి రెడ్డి, సంగీతం: వివేక్ సాగర్.