‘హే బల్వంత్’ సినిమాను 650 స్క్రీన్స్‌లో విడుదల చేయబోతున్నాం. ఈ సినిమాపై మాకున్న నమ్మకానికి ఇదే నిదర్శనం. గురువారం సాయంత్రం నుంచే ప్రీమియర్లు మొదలవుతాయి. జిమ్‌లు, డైట్లు చేయాల్సిన పనిలేదు. ఒక్క మూడు గంటలు టైమ్ మాకిస్తే.. నెలకు సరిపడా ఆరోగ్యాన్ని మేం మీకిస్తాం.. అందరూ హాయిగా వచ్చి నవ్వుకోండి’ అని వంశీ నందిపాటి అన్నారు.
సుహాస్, శివానీ నగరం జంటగా.. గోపీ అచ్చర దర్శకత్వంలో బి.నరేంద్రరెడ్డి నిర్మించిన చిత్రం ‘హే బల్వంత్’. శుక్రవారం(నేడు) సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఈ చిత్రాన్ని బన్నీవాస్‌తో కలిసి విడుదల చేస్తున్న వంశీ నందిపాటి పై విధంగా స్పందించారు.
ఇది తన కెరీర్లోనే బిగ్గెస్ట్ రిలీజ్ అనీ, ఈ సినిమాకు ఈ స్థాయి తీసుకొచ్చిన వంశీ నందిపాటికి కృతజ్ఞతలనీ, ‘హే బల్వంత్’లో సుహాస్ 2.ఓ ని చూస్తారని హీరో సుహాస్ నమ్మకం వెలిబుచ్చారు. ‘ఈ సినిమా రిలీజ్‌కు ముందు అన్నీ శుభశకునాలే కనిపిస్తున్నాయి. కొత్తదనంతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమాతో సుహాస్ నెక్ట్స్ ఫేజ్‌కు వెళ్లబోతున్నాడు. ముఖ్యంగా ైక్లెమాక్స్‌లో తను అందర్నీ ఆకట్టుకుంటాడు. తెలుగు సినిమాల్లో ‘హే బల్వంత్’ ఓ మెమొరబుల్ మూవీ కాబోతున్నది’ అని సీనియర్ నటుడు నరేష్ అన్నారు.