Amitabh Bachchan Grandson | బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ గారాలపట్టి సుహానా ఖాన్, అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా ప్రేమలో ఉన్నట్లు కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలు నిజం అనిపించేలా వీళ్లిద్దరు మళ్లీ కనిపించారు. గత నెల వీళ్లిద్దరు కలిసి లండన్‌లో జరిగిన ఓ పార్టీలో హాజరుకాగా.. ఓ నైట్ క్లబ్లో సుహానా ఖాన్, అగస్త్య మాట్లాడుకుంటూ ఉండగా మీడియా క్లిక్ మనించిన ఫొటోలు అప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఈ జంట మళ్లీ అభిషేక్ బచ్చన్ నడుపుతున్న కారులో కనిపించారు. దీంతో వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.
సుహానా ఖాన్, అగస్త్య నందా కలిసి ది ఆర్చీస్ అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను జోయా అక్తర్ తెరకెక్కించింది. ఇక ఈ సినిమా సమయం నుంచే వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. దీనికితోడు సుహానా, అగస్త్య నంద కలిసి తరచూ ఈవెంట్లలో పార్టీల్లో కనిపించడం కూడా ఈ వార్తలకు బలం చేకురినట్లయింది. అయితే అలాంటిది ఏం లేదని.. సుహానా అగస్త్య చిన్నప్పుడు నుంచి ఫ్రెండ్స్ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
Suhana Khan
Also read..
Sharad Pawar | మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేతో ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్ భేటీ.. Video
Mani Ratnam | మా నాన్నకు నేను దర్శకుడిని అవ్వడం ఇష్టం లేదు: మణిరత్నం