Mani Ratnam | మణిరత్నం చిత్ర పరిశ్రమలో ఇదొక సంచలనాత్మకమైన పేరు. దర్శకుడిగా ఎందరికో ఆయన ప్రేరణ. ఆయన దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టి దాదాపు 30 సంవత్సరాలు దాటినా.. ఆయన చేసిన సినిమాలు చాలా తక్కువే.. క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యం అని నమ్మే అతి కొద్ది దర్శకుల్లో ఆయన ఒకరు.
భారతీయ సినీ పరిశ్రమలో ఎందరో దర్శకులకు ఆయన ఆదర్శ ప్రాయుడు. రోజా, దళపతి, బొంబాయి, గీతాంజలి ఇలా ఎన్నో మరపురాని చిత్రాలకు నిర్ధేశకుడు. అయితే దర్శకుడిగా ఇంతటి సంచలన చిత్రాలకు కారణమైన మణిరత్నం అసలు దర్శకుడిగా మారటం, సినీ పరిశ్రమలోకి రావడం వాళ్ల నాన్నకు అస్సలు ఇష్టం లేదట. ఈ విషయం గురించి మణిరత్నం ఓ సందర్భంలో చెప్పారు.
వీనస్ స్టూడియో రత్నం అయ్యర్ కొడుకుగా వారసత్వంగా మీరు సినీ పరిశ్రమలోకి వచ్చారని చాలా మంది అనుకుంటారు. నాతో అడిగారు కూడా. కానీ నేను దర్శకుడిగా మారింది అలా కాదు. అంతేకాదు మా నాన్న మొదటినుంచి మా కుటుంబాన్ని చిత్ర పరిశ్రమకు దూరంగా వుంచాలని ప్రయత్నించేవాడు. ఆయన ఇష్ట ప్రకారమే నేను ముంబయ్‌లో ఎంబీఎ పూర్తిచేశాను. అయితే ఆ సమయంలోనే ఓ కంపెనీకి డైరెక్టర్‌గా వుండి.. అంత మందితో పనిచేయిస్తూ.. ఆ ఒత్తిడిని తట్టుకోవటం కంటే. నాకు సృజనాత్మకమైన దర్శకుడిగా వుండటం బెటర్ అనిపించింది. అందుకే సినిమాల వైపు వచ్చేశాను. అయితే అందరూ నేనేదో విదేశాలకు వెళ్లి ఫిలిం కోర్సు చేశానని అనుకుంటారు. కానీ నేను ఎలాంటి కోర్సు పూర్తిచేయలేదు. నిజం చెప్పాలంటే సినీ పరిశ్రమకు వచ్చే నాటికి నాకు దర్శకత్వం అంటే ఏమో కూడా తెలియదు. పట్టుదలతో ఏదైనా నేర్చుకుంటే వస్తుందనే నమ్మకంతోనే ఒక సినిమాకు దర్శకత్వం వహించాను. అలా ఆ రోజు ధైర్యం చేశాను. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు ప్రతి రోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే దర్శకత్వం చేస్తున్నా.. ప్రతి సినిమా మొదటి సినిమాలాగా కష్టపడాల్సిందే అని చెప్పుకొచ్చారు.
Also Read..
Deepika Kumari: ఆర్చరీలో క్వార్టర్స్‌కు చేరిన దీపికా కుమారి