పారిస్: భారత ఆర్చర్ దీపికా కుమారి(Deepika Kumari).. పారిస్ ఒలింపిక్స్‌లో క్వార్టర్స్ చేరుకున్నది. మహిళల వ్యక్తిగత ఆర్చరీలో ఆమె .. రెండు సార్లు ఒలింపిక్ మెడల్స్ గెలిచిన జర్మనీ క్రీడాకారిణి మిచ్చెల్లి క్రొప్పన్‌ను 6-4 తేడాతో ఓడించింది. దీపికా తొలి రౌండ్లో మంచి స్టార్ట్ ఇచ్చింది. అన్ని 9 పాయింట్లు స్కోరు చేసింది. కీలకమైన దశలో ప్రత్యర్థి మిచ్చెల్లిపై ఆధిపత్యాన్ని సాధించింది. సెకండ్ సెట్లో ఇద్దరు ఆర్చర్లు 27 స్కోర్ చేశారు. మూడవ సెట్లో దీపికా లీడింగ్ తీసుకున్నది. నాలుగో సెట్‌ను క్రొప్పన్ గెలుచుకున్నది. దీంతో ఫైనల్ సెట్ ఆసక్తికరంగా మారింది. కానీ దీపికా కుమారి అద్భుత ప్రదర్శనతో క్వార్టర్స్‌కు ఎంట్రీ ఇచ్చింది. మరో షూటర్ భజన్ కౌర్.. ప్రీక్వార్టర్స్‌లోనే ఓటమి చవిచూసింది.
𝐍𝐞𝐰𝐬 𝐅𝐥𝐚𝐬𝐡:𝐃𝐞𝐞𝐩𝐢𝐤𝐚 𝐊𝐮𝐦𝐚𝐫𝐢 𝐚𝐝𝐯𝐚𝐧𝐜𝐞𝐬 𝐭𝐨 𝐐𝐅 🔥
Deepika beats 2-time Olympic medalist Michelle Kroppen of Germany 6-4. #Archery #Paris2024 #Paris2024withIAS pic.twitter.com/2x7ITuXHDD
— India_AllSports (@India_AllSports) August 3, 2024