Green Card | గ్రీన్‌కార్డ్ నిబంధనల విషయంలో అమెరికా యూటర్న్
Green Card | అమెరికా (USA) లో శాశ్వత నివాస హక్కు (Green Card) నిబంధనల విషయంలో అమెరికా యూటర్న్ తీసుకుంది. గ్రీన్‌కార్డ్ దరఖాస్తు ప్రక్రియ జరుగుతున్న సమయంలో వలసదారులు యూఎస్ (US) ను విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని 'డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (DHS)' తాజాగా వెల్లడించింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
Green Card : అమెరికా (USA) లో శాశ్వత నివాస హక్కు (Green Card) నిబంధనల విషయంలో అమెరికా యూటర్న్ తీసుకుంది. గ్రీన్‌కార్డ్ దరఖాస్తు ప్రక్రియ జరుగుతున్న సమయంలో వలసదారులు యూఎస్ (US) ను విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని ‘డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (DHS)’ తాజాగా వెల్లడించింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తాత్కాలిక వలసదారులు గ్రీన్‌కార్డ్ దరఖాస్తులు సమర్పించడానికి స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుందని అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) మే 21న చేసిన ప్రకటన గందరగోళానికి దారితీసింది. దీనిపై తాజాగా డీహెచ్ఎస్ వివరణ ఇచ్చింది.
తాజా ప్రకటనలో డీహెచ్ఎస్ స్పందిస్తూ.. ఇదేమీ విస్తృతస్థాయి విధాన మార్పేమీ కాదని వెల్లడించింది. దరఖాస్తుదారుడు గ్రీన్‌కార్డు ప్రక్రియను అమెరికాలో ఉండి పూర్తిచేయాలా..? స్వదేశానికి వెళ్లాలా..? అన్నదానిని ఇమిగ్రేషన్ అధికారి నిర్ణయిస్తారని తెలిపింది. ఇది ఎప్పటి నుంచో అమల్లో ఉన్న నిబంధనే అని పేర్కొన్నది. ఇమిగ్రేషన్ అధికారులకు ఆ విచక్షణాధికారాన్ని గుర్తుచేయడమే మే 21న ఇచ్చిన మార్గదర్శకాల ఉద్దేశమని వివరించింది. శాశ్వత నివాసం కోరుతున్న వలసదారుల దరఖాస్తుల పరిశీలన జరుగుతున్న సమయంలో కూడా వారు యూఎస్‌లో ఉండేందుకు అనుమతి ఉంటుందని స్పష్టంచేసింది.
వీసా ఓవర్‌స్టేలు, ఇమిగ్రేషన్‌కు సంబంధించిన ఇతర ఆందోళనలను మాత్రం తాము పరిగణనలోకి తీసుకుంటామని సూచనప్రాయంగా వెల్లడించింది. డీహెచ్ఎస్ వివరణ ఇచ్చినప్పటికీ.. ఎలాంటి పరిస్థితుల్లో గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులు యూఎస్‌ను విడిచి వెళ్లాల్సిన అవసరం ఉంటుందో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దాంతో ఈ వ్యవహారంపై వలసదారుల్లో పలు ప్రశ్నలు మిగిలేఉన్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

