సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా రూపొందుతున్న క్రికెట్ నేపథ్యంలో సాగే కామెడీ ఎంటర్టైనర్ ‘G.O.A.T’. మొగుళ్ల చంద్రశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. అనుకున్నదానికంటే సినిమా బాగా వచ్చిందని, అందరూ మెచ్చే సినిమాగా నిలుస్తుందని త్వరలోనే టీజర్, పాటలు.. ఇలా అన్ని అప్డేట్స్తో ముందుకు రానున్నామని నిర్మాత మొగుళ్ల చంద్రశేఖర్ తెలిపారు.
మొట్ట రాజేంద్రన్, స్వరదమన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న, పృథ్వీ, ఆనందరామరాజు, పమ్మి సాయి, చమ్మక్ చంద్ర, నవీన్ నేని తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నిర్మాణం: జైశ్నవ్ ప్రొడక్షన్స్, మహాతేజ క్రియేషన్స్.