SS4 | గాలోడు సినిమాతో ప్రేక్షకులను పలుకరించిన సుడిగాలి సుధీర్(Sudigaali Sudheer) ప్రస్తుతం మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్న విషయం తెలిసిందే. సుధీర్ , దివ్య భారతి (Divyabharathi) కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ఎస్ఎస్4 (SS4). పాగల్ ఫేం నరేష్ కుప్పిలి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ టీంలోకి మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్ కు స్వాగతం పలుకుతూ ఇప్పటికే మేకర్స్ అప్డేట్ అందించారు.
తాజాగా ఈ ప్రాజెక్ట్ టైటిల్‌కు సంబంధించిన వార్త బయటకు వచ్చింది. ఎస్ఎస్4 టైటిల్‌ను రేపు సాయంత్రం 04:05 గంటలకు లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రాన్ని లక్కీ మీడియా, మహాతేజ క్రియేషన్స్ బ్యానర్స్ పై చంద్ర శేఖర్ రెడ్డి మొగుళ్ళ, బెక్కం వేణుగోపాల్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
విశ్వక్ సేన్ నటించిన పాగల్, ఓరి దేవుడా, దాస్ కా ధమ్కీ సినిమాలకు లియోన్ జేమ్స్ అదిరిపోయే ఆల్బమ్స్ అందించాడని తెలిసిందే. మరి సుధీర్ సినిమాకు ఎలాంటి ఆల్బమ్ అందిస్తాడని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్. టీవీ హోస్ట్‌గా జబర్దస్థ్, ఎక్స్ట్రా జబర్దస్థ్, పోవే పోరా, ఢీ డ్యాన్స్ షోలతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న సుధీర్‌కు లేటెస్ట్ ప్రాజెక్ట్ మంచి సక్సెస్ అందించాలని విష్ చేస్తున్నారు మూవీ లవర్స్.
Team #SS4 to unveil their ‘TITLE’ tomorrow on the occasion of @sudheeranand‘s birthday.
Releasing tomorrow at 4:05PM 💥
🎬 @NaresshLee
💃@divyabarti2801
🎹 @leon_james
💰@MahatejaC @luckymediaoffStay tuned. pic.twitter.com/cMwGJUa3vd
— Vamsi Kaka (@vamsikaka) May 18, 2023