SS4 | సుడిగాలి సుధీర్(Sudigaali Sudheer), దివ్య భారతి (Divyabharathi) హీరో హీరోయిన్లుగా పాగల్ ఫేమ్ దర్శకుడు నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న చిత్రం (SS4). నిర్మాతలు చంద్ర శేఖర్ రెడ్డి మొగుళ్ళ మరియు బెక్కం వేణుగోపాల్, లక్కీ మీడియా మరియు మహారాజా క్రియేషన్స్ బ్యానర్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నేడు ఈ సినిమా ఘనంగా లాంఛ్ అయింది.
ప్రముఖ నిర్మాతలు డి. సురేష్ బాబు, కె.ఎస్ రామారావు, సూర్యదేవర రాదాకృష్ణ, కెఎల్ దామౌదర ప్రసాద్ ఈ పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చదలవాడ శ్రీనివాస్ క్లాప్ కొట్టగా.. జెమినీ కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
నిర్మాత చంద్ర శేఖర్ రెడ్డి మొగుళ్ళ మాట్లాడుతూ..ఈ సినిమా ఏడాది క్రితమే ఫైనల్ అయిపోయింది. 4, 5 నెలల నుండి ప్రీ ప్రొడక్షన్ వర్క్ బాగా చేశాం. ఈ సినిమాకు సంబంధించి బెక్కం వేణుగోపాల్ గారే కర్త, కర్మ , క్రియ అన్ని. ఈ సినిమాకు లియో మ్యూజిక్ అందిస్తున్నాడు. మా సినిమాను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానన్నారు.
దర్శకుడు నరేష్ కుప్పిలి మాట్లాడుతూ..సుధీర్‌కు ఈ కథను ఒక గంట నేరేట్ చేయగానే ఆయనకు బాగా నచ్చి ఒప్పుకున్నారు. మా ప్రొడ్యూసర్స్ ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అన్ని సమకూర్చారు. లియో మాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా రైటర్ ఫణికి థాంక్యూ.
నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ..ఈ సినిమా ఫస్ట్ షాట్ కి చదలవాడ శ్రీనివాస్ క్లాప్ కొట్టగా జెమినీ కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఎన్నో హిట్ సినిమాలు చేసాను. ఇది కూడా ఒక హిట్ సినిమా అవ్వబోతుంది. మీ సపోర్ట్ కావాలి. దర్శకుడు నరేష్ తో నాకు ఏడేళ్ల పరిచయం ఉందన్నారు.
హీరో సుధీర్ మాట్లాడుతూ..ఇక్కడికి వచ్చిన అందరికి ధన్యవాదాలు. నన్ను ప్రేక్షకులు ఇంతగా ఆదరించడానికి కారణం మీడియానే. టీం అందరి గురించి ఇదివరకే చెప్పారు. మరోసారి ప్రెస్ మీట్ పెట్టి ఇంకొన్ని విషయాలను పంచుకుంటాం ధన్యవాదాలు.
SS4 చిత్రానికి పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు:
డైరెక్టర్ : నరేష్ కుప్పిలి
ప్రొడ్యూసర్స్ – చంద్రశేఖర్ రెడ్డి మొగుల్ల, బెక్కెం వేణుగోపాల్
మ్యూజిక్ – లియొన్ జేమ్స్
డి.ఓ. పి – బాలాజీ సుబ్రహ్మణ్యం
ఎడిటర్ – కె విజయవర్ధన్
ఆర్ట్ – రాజీవ్ నాయర్
రచయిత – ఫణికృష్ణ సిరికి
కో-డైరెక్టర్ – శ్రీకాంత్ కోల
అసోసియేట్ డైరెక్టర్ – బబ్లు
ప్రొడక్షన్ కంట్రోలర్ – రాంబాబు
బుద్దాల
ప్రొడక్షన్ మేనేజర్స్ – ప్రభాకర్ రాజు, గోవిందు దనాల
కాస్ట్యూమ్ డిజైనర్- శ్రీహిత
పి.ఆర్.ఓ – ఏలూరు శ్రీను, మడూరి మధు
Clicks from the Opening Muhurtham Ceremony of #SS4 – Starring @sudheeranand & @divyabarti2801 in lead roles 📸❤️
Shoot begins soon 🎥
🎬 @NaresshLee (Paagal Director)@MahatejaC @luckymediaoff pic.twitter.com/xsCkxJK2dr
— Maduri Mattaiah (@madurimadhu1) May 12, 2023