టాలీవుడ్ (Tollywood) యాక్టర్ సుధీర్ బాబు (Sudheer Babu) నటిస్తోన్న తాజా చిత్రం శ్రీదేవి సోడా సెంటర్ (Sridevi Soda Center). త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా చిత్రయూనిట్ ప్రమోషన్స్ పనుల్లో బిజీగా ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా పాన్ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తో ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు మేకర్స్. శనివారం రాత్రి జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో ఇంటర్వ్యూకు సంబంధించిన చిన్న గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ తో ఎదురైన ఓ అనుభవం గురించి షేర్ చేసుకున్నాడు సుధీర్ బాబు.
ఈ ఫంక్షన్ కు వచ్చిన చాలా మంది అతిథులు నా ఫిజిక్, స్టామినా గురించి మాట్లాడారు. నన్ను నేను ఫిట్ గా ఉంచుకున్న మాట నిజం. కానీ ఇటీవల నేను ప్రభాస్ దగ్గరకు వెళ్లాను. ప్రభాస్ చాలా రుచికరమైన ఫుడ్ తెప్పించారు. మీకో విషయం చెప్పాలి.. ప్రభాస్ తో వారంపాటు ఎవరైనా ఉన్నట్టైతే వాళ్లు పూర్తిగా డైట్ ప్లాన్ ను పక్కన పెట్టేస్తారు. వర్కవుట్ ప్లాన్స్, సిక్స్ ప్యాక్, ఇతర పనులకు దూరం అవుతారు. ప్రభాస్ తన సింప్లిసిటీతో అందరినీ చంపేస్తాడు. అది ప్రభాస్ గుణమని చెప్పుకొచ్చాడు సుధీర్‌బాబు.
పలాస ఫేం కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. ఆగస్టు 27న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది.
ఇవికూడా చదవండి..
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!
Raashi Khanna | రాశీఖన్నాకు మారుతి ఆశీర్వచనాలు..ట్రెండింగ్ లో స్టిల్
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!