స్మార్ట్‌గా పరిగెత్తండి
ఉదయం నిద్రలేవగానే మనల్ని పలకరించే తొలి నేస్తం స్మార్ట్ ఫోన్. వాట్సాప్, ఫేస్బుక్ , ఇన్స్టాగ్రామ్ చూడటానికి మాత్రమే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్.. మన ఆరోగ్యాన్ని శాసించే ఒక అద్భుతమైన పరికరమని చాలామందికి తెలియదు. మన శరీరాన్ని మెరుగుపరుచుకోవడం కోసం మనం జిమ్‌కోచ్ కోసమో, డైటీషియన్ అపాయింట్ కోసమో చూడాల్సిన పనిలేదు.
ఉదయం నిద్రలేవగానే మనల్ని పలకరించే తొలి నేస్తం స్మార్ట్ ఫోన్. వాట్సాప్, ఫేస్బుక్ , ఇన్స్టాగ్రామ్ చూడటానికి మాత్రమే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్.. మన ఆరోగ్యాన్ని శాసించే ఒక అద్భుతమైన పరికరమని చాలామందికి తెలియదు. మన శరీరాన్ని మెరుగుపరుచుకోవడం కోసం మనం జిమ్‌కోచ్ కోసమో, డైటీషియన్ అపాయింట్ కోసమో చూడాల్సిన పనిలేదు. మన జేబులో ఉండే స్మార్ట్ ఫోనే మనల్నీ పరిగెత్తిస్తుంది. మనం ఏం తినాలో చెబుతుంది.. చివరికి మనం ఎంతసేపు నిద్రపోవాలో కూడా డిసైడ్ చేస్తుందని ఇటీవల ఓ అధ్యయనం సైతం పేరొంది.
యాక్టివిటీ ట్రాకింగ్: మన ఫోన్లో ఉండే యాక్సిలరోమీటర్ అనే సెన్సర్ సాయంతో మనం నడవడం, మెట్లు ఎకడం, పరిగెత్తడం వంటి పనులను గుర్తించి ఆ డేటాను మనకు అర్థమయ్యే విధంగా మారుస్తుంది. అలాగే మనం ఎంత దూరం ప్రయాణించాం? ఏ మార్గంలో వెళ్లామో ఇది మ్యాప్ రూపంలో చూపుతుంది. ఇందులో అడుగుల లెకింపు, క్యాలరీల ఖర్చు, దూరం, యాక్టివ్ టైమ్ లాంటివన్నీ గమనించవచ్చు. పర్సనల్ వరౌట్ కోసం: ఇది మన శరీర తత్వం, బరువు, ఎత్తు, మన ఆరోగ్య లక్ష్యాలను బట్టి మనకు సరిపోయే వ్యాయామాలను రూపొందించే ఒక డిజిటల్ సిస్టమ్. ఇది మన సామర్థ్యాలను బట్టి వ్యాయామాలను సూచిస్తూ మనల్ని గైడ్ చేస్తుంది.
డైట్ ట్రాకింగ్: మనం ప్రతిరోజూ తీసుకునే అల్ఫాహారం, లంచ్, స్నాక్స్, డిన్నర్లో ఉండే క్యాలరీలను, పోషకాలను లెకగట్టడమే ఈ డైట్ ట్రాకింగ్. మన లక్ష్యం ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటమైనా మనం తీసుకునే ఆహారంపై అవగాహన ముఖ్యం. ఇది క్యాలరీల లెకింపు, మాక్రో న్యూట్రియెంట్స్‌ని విశ్లేషణ చేస్తుంది. దీనివల్ల మనం మైండ్‌ఫుల్ ఈటింగ్ అలవాటు చేసుకుంటాం.
స్లీప్ అనాలసిస్: ఆరోగ్యకరమైన జీవితానికి సరైన ఆహారం, వ్యాయామం ఎంత ముఖ్యమో నాణ్యమైన నిద్రకూడా అంతే ముఖ్యం. మనం రాత్రి పడుకున్నప్పటి నుంచి ఉదయం నిద్ర లేచే వరకు మన శరీరం ఏ స్థితిలో ఉంది, మధ్యలో ఎన్నిసార్లు మెలకువ వచ్చింది, ఎంతసేపు గాఢనిద్రలో ఉన్నాం.. తదితర వివరాలన్నిటినీ అనాలిస్ చేసి డేటాను అందిస్తుంది.
సాధారణంగా మనం చేసే ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే మనం ఎంత వరకు సాధించామో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ ఫిట్నెస్ ప్రయాణంలో కూడా అంతే. మనం ఎక్సర్సైజ్లు మొదలుపెట్టిన తొలి రోజు నుంచి నేటి వరకు శరీరంలో, సామర్థ్యంలో వచ్చిన మార్పులను గమనించుకోవడం అవసరం. ఇందులో బీఎంఐ, వీక్లీ, మంత్లీ సమ్మరీ వంటివి ఉంటాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

