Maama Mascheendra | టాలీవుడ్ యువ హీరో సుధీర్‌బాబు (Sudheer Babu) నటిస్తోన్న తాజా చిత్రం ‘మామా మశ్చీంద్ర’ (Maama Mascheendra). యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యాక్టర్ హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో సుధీర్ మూడు విభిన్న గెటప్స్‌లో కనిపించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ అప్డేట్ అందించాడు సుధీర్ బాబు. ఈ విషయాన్ని తెలియజేస్తూ హర్షవర్ధన్, సుధీర్ బాబు టీజర్ అనౌన్స్ మెంట్ వీడియోను లాంఛ్ చేశారు.
మామా మశ్చీంద్ర టీజర్‌ను ఏప్రిల్ 14న లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే ఏ సమయంలో అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ‘మామా మశ్చీంద్ర’ అనే టైటిల్ ఎందుకు పెట్టినట్టు? అనే ట్వీట్‌తో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో ఈషా రెబ్బా, మృణాళిని రవి ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. హర్షవర్ధన్, అలీ రెజా, రాజీవ్ కనకాల, హరితేజ, అజయ్, మిర్చి కిరణ్ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తెలుగు, హిందీ బైలింగ్యువల్ సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పీ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. విడుదల తేదీపై రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనుంది సుధీర్ బాబు టీం. సుధీర్ బాబు ఇందులో బొద్దుగా, యంగ్ స్టైలిష్‌గా, ఏజ్ బార్ గెటప్‌లో.. మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలతో వినోదాన్ని అందించబోతున్నట్టు అర్థమవుతోంది.
‘మామా మశ్చీంద్ర’ అనే టైటిల్ ఎందుకు పెట్టినట్టు? 🤔
Nitro Star @isudheerbabu & @HARSHAzoomout announces #MaamaMascheendra TEASER Release Date in Style – APRIL 14th💥
– https://t.co/wPE1AAsUDl@YoursEesha @mirnaliniravi @chaitanmusic @SVCLLP #SrishtiCelluloids @adityamusic pic.twitter.com/YWyNMmzpKC
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) April 10, 2023
మామా మశ్చీంద్ర టీజర్ అనౌన్స్ మెంట్ వీడియో..
Thiruveer | మసూద హీరో తిరువీర్ పీరియాడిక్ సినిమా.. వివరాలివే
Project K | ప్రభాస్ ప్రాజెక్ట్ Kలో విలన్ ఆర్మీ రైడర్స్ ఎలా ఉండబోతున్నారంటే..?
Vakeel Saab 2 | వకీల్‌సాబ్ 2 ఆన్ ది వే.. క్రేజీ న్యూస్‌తో అభిమానులు ఖుషీ!