Sudheer Babu Next Movie| సుధీర్ బాబు కెరీర్ ఒకడుగు ముందుకు వేస్తుంటే.. మూడగులు వెనక్కి పడుతుంది. బోలెడంత టాలెంట్, చక్కటి రూపం, మహేష్‌బాబు వంటి స్టార్ సపోర్ట్ ఉన్నా సుధీర్ బాబు కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నాడు. కెరీర్ బిగెనింగ్ నుండి వినూత్న సినిమాలు చేస్తున్నా ఎందుకో సుధీర్‌కు రావాల్సిన గుర్తింపు రావడం లేదు. ‘సమ్మోహనం’ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న సుధీర్.. ఈ క్రేజ్‌ను కాపాడుకోవడానికి ప్రతీ సినిమాకు తన బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ టైమ్ బాలేకో, అదృష్టం లేకో సుధీర్ సినిమాలు వరుసగా ఫ్లాపుల బాట పడుతున్నాయి. ఈ ఏడాది రిలీజైన హంట్, మామ మశ్చీంద్ర సినిమాలు వరుసగా పెవీలియన్ బాట పట్టాయి. ప్రస్తుతం సుధీర్ బాబు మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు.
సుధీర్ చేతిలో ఇప్పుడు మూడు సినిమాలున్నాయి. అందులో యూవీ సంస్థలో తెరకెక్కుతున్న సినిమా ఒకటి. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మా నాన్న సూపర్ హీరో అంటూ తన కొత్త సినిమాను ప్రకటించాడు సుధీర్‌బాబు. అభిలాష్ కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. లేటెస్ట్గా రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. పోస్టర్లో కేరళ స్టేట్ లాటరీ అంటూ కోటి రూపాయలు లాటరీని ఒకరు గెలుచుకున్నట్లు ఓ ఫ్లెక్స్‌ను పెట్టారు. ఇది సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచింది. జై క్రిష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కామ్ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మిస్తున్నాడు.