Jatadhara | టాలీవుడ్ యాక్టర్ సుధీర్ బాబు (Sudheer babu)నటిస్తోన్న చిత్రం జటాధర (Jatadhara). వెంకట్ కల్యాణ్ (Venkat Kalyan) కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న తెలుగు, హిందీ బైలింగ్యువల్ ప్రాజెక్ట్‌గా వస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీ టీజర్‌ను ఆగస్టు 8న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు కొత్త లుక్ షేర్ చేశారు.
ఓ వైపు శివుడు మరోవైపు చేతిలో త్రిశూలాన్ని పట్టుకున్న సుధీర్‌బాబు, ఇంకోవైపు ఉగ్రరూపంలో కనిపిస్తున్న సోనాక్షి సిన్హా లుక్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని శివన్ నారంగ్, ప్రేర్నా అరోరా, నిఖిల్ నందా, ఉజ్వల్ ఆనంద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
పాపులర్ జీ స్టూడియోస్ భాగస్వామ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో యాక్షన్‌తో కూడిన ఉత్కంఠభరితమైన సన్నివేశాలు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించబోతున్న టీజర్ అప్డేట్ లుక్ హింట్ ఇచ్చేస్తుంది.. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది.
సుధీర్ బాబు నటించిన హరోం హర, మా నాన్న సూపర్ హీరో సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఇంప్రెస్ చేయలేకపోయాయి. దీంతో తన ఆశలన్నీ జటాధరపైనే పెట్టుకున్నాడు.
The wait is over! Witness the mythology-meets-visual spectacle of #JATADHARA. Sudheer Babu, Sonakshi Sinha, and a glimpse of Lord Shiva ignite the screen. ZEE Studios & #PrernaVArora redefine Indian cinema, yet again. Teaser 8th August—history in the making. #UmeshKrBansal… pic.twitter.com/nEzm4bwEUB
— BA Raju’s Team (@baraju_SuperHit) August 4, 2025
Kantara 3 | కాంతార 3లో జూనియర్ ఎన్టీఆర్… ఇదే నిజమైతే ఫ్యాన్స్‌కి పూనకాలే..!
Kamal Hassan | సనాతన బానిసత్వాన్ని అంతంచేసే ఆయుధం అదొక్కటే.. కమల్ హాసన్