Jatadhara | సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న యాక్టర్లలో ఒకడు సుధీర్ బాబు (Sudheer babu). ఈ టాలెంటెడ్ యాక్టర్ ఈ సారి రూటు మార్చి సరికొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుధీర్ బాబు నటిస్తోన్న సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ జటాధర (Jatadhara).
వెంకట్ కల్యాణ్ (Venkat Kalyan) కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ తెలుగు, హిందీ బైలింగ్యువల్ సినిమాగా వస్తోంది. కాగా మేకర్స్ ఎన్నో రోజులుగా విడుదలపై నెలకొన్న డైలామాకు తెరదించారు. ఈ మూవీని నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా త్వరలో మొదలు కానున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్.
ఓ వైపు శివుడు మరోవైపు చేతిలో త్రిశూలాన్ని పట్టుకున్న సుధీర్‌బాబు, ఇంకోవైపు ఉగ్రరూపంలో కనిపిస్తున్న సోనాక్షి సిన్హా లుక్స్‌ను మేకర్స్ ఇప్పటికే విడుదల చేయగా.. సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. శిల్పా శిరోద్కర్ కీలక పాత్ర పోషిస్తోంది.
సుధీర్ బాబు నటించిన హరోం హర, మా నాన్న సూపర్ హీరో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయని తెలిసిందే. దీంతో తన ఆశలన్నీ జటాధర సినిమాపైనే పెట్టుకున్నాడు. మరి ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ సుధీర్‌బాబుకు ఎంతలా కలిసొస్తుందో చూడాలి.
SUDHEER BABU – SONAKSHI SINHA: ‘JATADHARA’ TO RELEASE ON 7 NOV 2025… The battle between light and darkness begins… #Jatadhara – starring #SudheerBabu and #SonakshiSinha in pivotal roles – will release in cinemas on 7 Nov 2025 in #Hindi and #Telugu.
Also featuring… pic.twitter.com/Bsyi3CmkZv
— taran adarsh (@taran_adarsh) September 15, 2025
Mirai | మిరాయ్’లో శ్రీరాముడిగా నటించింది ఎవరో తెలుసా? ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్!
OG | ఓజీ పిల్లర్స్ ఒకే ఫ్రేములో.. మిలియన్ డాలర్ పిక్చర్ అంటూ ట్వీట్