పెద్ద మనసు చాటుకున్న కిచ్చా సుదీప్

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటుడిగాను కాదు మంచి మానవత్వం ఉన్న మనిషిగా అందరి మనసులలో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఆయన తాజాగా ఇద్దరు వృద్ధ దంపతులకు ఆసరాగా నిలిచారు. దొడ్డ పట్టణంలో నివసిస్తున్న శ్రీనివాస్ (78), కమలమ్మ(70) దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు దివ్యాంగుడు. మరో కుమారుడు తల్లి దండ్రులని వదిలేసి మైసూర్లో స్థిరపడ్డాడు. అయితే వృద్ధ దంపతులు బెంగళూరులో తముకున్న ఆస్థులని అమ్ముకొని దొడ్డ పట్టణంకి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. అయితే కమలమ్మ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. ఈ విషయం తెలుసుకున్న సుదీప్ ఆమెకు బెంగళూరులోని జైన్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ వారి బాగోగులు చూసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న వారు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సుదీప్ ప్రస్తుతం ఉపేంద్రతో కలిసి మల్టీ స్టారర్ చేస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Help
- kannada actor
- sudeep
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

